English | Telugu

రవితేజ రూటు మార్చుకుంటున్నాడా?.. తన నెక్స్‌ట్‌ సినిమాకి డిఫరెంట్‌ టైటిల్‌!

ఇటీవలికాలంలో వరస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ.. ఒక సాలిడ్‌ హిట్‌ కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. సబ్జెక్ట్‌ల పరంగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ, హిట్‌ మాత్రం అతని దరి చేరడం లేదు. తాజాగా కిశోర్‌ తిరుమల కాంబినేషన్‌లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.


ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు నటిస్తారనే వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ ఆ వార్తలను ఖండించింది. అధికారికంగా తాము ఇచ్చే అప్‌డేట్స్‌నే ఫాలో అవ్వమని సూచించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడీ సినిమాకి అనుకుంటున్న టైటిల్‌ గురించి వార్తలు వస్తున్నాయి. ఒక సెన్సిబుల్‌ టైటిల్‌ను ఈ సినిమా కోసం ఫిక్స్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.


నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన శివ నిర్వాణ.. ఆ తర్వాత విజరు దేవరకొండ, సమంతలతో చేసిన ఖుషి ఫ్లాప్‌ అవ్వడంతో అతని కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న శివ.. ఒక మంచి హిట్‌తో మళ్ళీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని డిసైడ్‌ అయ్యాడు. అందుకే రవితేజతో ఒక డిఫరెంట్‌ సినిమాను ప్లాన్‌ చేశాడు. ఈ సినిమాలో భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం 'ఇరుముడి' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసారని విశ్వసనీయ సమాచారం. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దానికి 'ఇరుముడి' అనే టైటిల్‌ సరిగ్గా సరిపోతుందని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. ఇదే నిజమైతే రవితేజ నుంచి వరసగా వస్తున్న రెండు సినిమాల టైటిల్స్‌ అతని ఇమేజ్‌కి భిన్నంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎన్నో మాస్‌ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన రవితేజ.. ఇప్పుడు క్లాస్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్స్‌తో అందర్నీ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.


ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు రవితేజ. డిసెంబరు నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమవుతుంది. రవితేజకు, శివకు ప్రస్తుతం హిట్‌ ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ ఎంతో కృషి చెయ్యాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.