English | Telugu

లెజండ్రీ హీరోయిన్ చావుకి బ్లాక్ మ్యాజిక్ కారణమా! మరి ఆమె భర్త ఏం చెప్పాడు

-బాలీవుడ్ ని కుదిపేస్తున్న బ్లాక్ మ్యాజిక్ మాటలు
-పరాగ్ త్యాగి ఏం చెప్తున్నాడు
-అసూయ అనేది ఉందా!
-ఆ మాటల వెనక ఆంతర్యం ఏంటి!

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా కలయికలో వచ్చిన మూవీ 'ముజ్సే షాదీ కరోగి'. పైగా ఎంటర్ టైన్ మెంట్ లో కింగ్ మేకర్ గా గుర్తింపు పొందిన డేవిడ్ ధావన్ దర్శకుడు. దీన్ని బట్టి ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఆ చిత్రంలో బిజ్జి అనే క్యారక్టర్ లో క్యామియో ఎప్పిరియెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నటి షెఫాలీ జరీవాలా(Shefali Jariwala).2002 వ సంవత్సరం నుంచే మోడల్ గా కెరీర్ ని ఆరంభించి, పలు హిందీ మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోలతో పాటు కన్నడ చిత్రంలో కూడా మెరిసింది. ముఖ్యంగా 'కాంటా లగా' అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ఎనలేని ఖ్యాతితో పాటు ఫ్యాన్ బేస్ ని, సిల్వర్ స్క్రీన్ పై మెరిసే హీరోయిన్స్ కి ధీటుగా లెజండ్రీ స్టేటస్ ని సొంతం చేసుకుంది.


ఈ విధంగా కెరీర్ లో దూసుకుపోతున్న షెఫాలీ గత ఏడాది జనవరి 27 న చనిపోయింది. బ్యూటీ ట్రీట్ మెంట్ లో భాగంగా ఉపవాసం ఉన్న రోజు ఇంజక్షన్ తీసుకోవడం వల్ల ఆమె చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న షెఫాలీ భర్త పరాగ్ త్యాగి మాట్లాడుతు దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలా మంది ఇలాంటివి నమ్మరు కానీ నేను నమ్ముతాను. చేతబడులు అనేవి జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ పీపుల్ వారు పడే కష్టాలు కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. ఆ విధంగా నా భార్య పై చేతబడి చేసారు. ఎవరు చేశారనేది మాత్రం తెలియదు. మొత్తం రెండు సార్లు చేసారు. మొదటి సారి పరిస్థితులు వాటంతట అవే సరిదిద్దుకున్నాయి. కానీ రెండవ సారి వ్యతిరేఖంగా మారిపోయాయి. నాకు దైవ భక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగినపుడు ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యని తాకినప్పుడు ఏదో జరుగుతుందని అర్థమైంది. ఆమెని కాపాడమని ఎంతో వేడుకున్నాను.

also read: ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక కీలక వ్యాఖ్యలు


కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని తన ఆవేదనని వ్యక్తం చేసాడు. షెఫాలీ కి పరాగ్ త్యాగి(Parag Thyagi)రెండవ భర్త.. 2014 లో ఆ ఇద్దరి వివాహం జరగగా 2008 నుంచి పరాగ్ త్యాగి నటనా వృత్తిలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు సినిమాలతో పాటు పన్నెండు సీరియల్స్ లో చేసాడు. అలాంటి పరాన్ త్యాగి షెఫాలీ మరణంపై చెప్పిన బ్లాక్ మ్యాజిక్ మాటలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. షెఫాలీ స్వస్థలం గుజరాత్ కాగా 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌ గా కూడా చేసింది. చనిపోయే నాటికీ ఆమె వయసు 42 సంవత్సరాలు.