English | Telugu

పాన్ ఇండియా హీరో చెంప చెళ్లుమనిపించిన పూజా హెగ్డే!

- పూజా హెగ్డేని లైంగికంగా వేధించిన ఆ పాన్ ఇండియా హీరో ఎవ‌రు?

- ఆరోజు క్యార‌వాన్‌లో ఏం జ‌రిగింది?

- పూజా హెగ్డే సీన్స్‌ని డూప్‌తో కంప్లీట్ చేసిన ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా ఎదగాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడేవారు నటీమణులే. అవకాశాల కోసం ఎన్నో అడ్డంకులు దాటుకొని రావాల్సి ఉంటుంది. హీరోయిన్లుగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా చెప్ప్పుకోలేని ఎన్నో అవమానాలు వారికి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఓ ఘటన హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో జరిగింది.

సినిమా రంగంలోకి వచ్చినంత మాత్రాన తమను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, తమకూ ఆత్మాభిమానం, సంస్కారం ఉంటుందని నటీతమణులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సందర్భం వచ్చినపుడు తమకు కలిగిన చేదు అనుభవాలను అందరితో పంచుకోవడం మనం చూస్తున్నాం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ పాన్ ఇండియా హీరో వల్ల పడిన ఇబ్బంది గురించి వెల్లడించారు పూజా హెగ్డే. ‘కొన్నేళ క్రితం ఒక పాన్ ఇండియా మూవీలో నటించాను. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా అనుమతి లేకుండా ఆ సినిమాలోని హీరో నా క్యారవాన్‌లోకి వచ్చాడు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంతటితో ఆగకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మౌనంగా ఉండడం సరికాదని భావించిన నేను అతని చెంప చెళ్లుమనిపించాను. అతను అది ఊహించలేదు. వెంట‌నే క్యారవాన్ దిగి వెళ్లిపోయాడు.

ఇది జరిగిన తర్వాత ఆ హీరో నాతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ సినిమాలో కొన్ని సీన్స్ నాతో చెయ్యాల్సి ఉంది. కానీ, డూప్‌ను పెట్టి బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు’ అంటూ తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు పూజా హెగ్డే. అయితే ఆ పాన్ ఇండియా హీరో ఎవరు అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. పూజా చేసిన వ్యాఖ్యలు ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ వర్గాలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నాయి. ఆ హీరో ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.