English | Telugu
రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. అతనికి బుద్ధి అనేది ఉందా
Updated : Jan 19, 2026
-వైరల్ అవుతున్న రేణు దేశాయ్ స్పీచ్
-ఎవర్ని టార్గెట్ చేసింది
-తన ఆవేదన ఎందుకు
-ఏం చెప్పదలచుకుంటుంది
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మాజీ వైఫ్ గా, హీరోయిన్ గా,కాస్ట్యూమ్ డిజైనర్ గా నటిగా రేణుదేశాయ్(Renu Desai)యొక్క ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పలు నూతన ప్రాజెక్ట్స్ కూడా వింటూ ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్ట్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించేందుకు సిద్ధమవుతుంది. జంతు ప్రేమికురాలు కూడా అయిన రేణు దేశాయ్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి.
ఆమె మాట్లాడుతు వంద కుక్కల్లో ఐదు చెడ్డవి ఉంటాయి.ఆ ఐదు కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని, ఆ మనిషి ప్రాణాలకి విలువ కట్టి వంద కుక్కల్ని చంపడం ఎంత వరకు న్యాయం. రోజుకి లక్షల మంది దోమ కాటు వల్ల వచ్చే డెంగీ జ్వరంతో, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా. హెల్మెట్స్ లేకుండా ఎంతో మంది బైక్ పై వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఆ ప్రాణాలకి విలువ లేదు కానీ కుక్క కురిసి చనిపోతే విలువ. రోజు నా వెంట 15 మంది కుక్కలు వస్తాయి. నన్ను ఏమి అనవు. కుక్క ఆయుక్షు 10 సంవత్సరాలు.
కొంత మంది మగాళ్లు మర్దార్లు చేస్తారు. రేపులు చేస్తారు. అందుకని అందరు మగాళ్లని చంపుతారా! మైండ్ ఇచ్చారు కదా కొంచం వాడండి. సింబాస్ లా కాలేజీ వాళ్ళు, కర్నల్ సెంథిల్ చదువుకున్న వ్యక్తే కదా. ఏ ఏరియాలో కుక్కలు తప్పు చేస్తే ఆ కుక్కల్ని వరకే ఏదైనా చేద్దాం. కుక్కల్ని ఆ శివుడు, అమ్మవారే సృష్టించారు. నిజంగా ఈ మనుషులకి మంచి చెయ్యాలంటే చాలా ఉన్నాయి. మనుషుల లైఫ్ కి ఎంత వాల్యూ ఉందో జంతువుల లైఫ్ కి అంతే వాల్యూ ఉంది. ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఆల్కహాల్, రేపిస్టిస్ అని చెప్పుకొచ్చింది. గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందని రేణు దేశాయ్ తన ఆవేదనని వ్యక్తం చేసారు.