English | Telugu

ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. తొలి తెలుగు చిత్రమని మేకర్స్ ప్రకటన 

-ఆగని మెగా, విక్టరీ జోరు
-రికార్డు కలెక్షన్స్
-మేకర్స్ ఎంత ప్రకటించారు
-ఎండింగ్ ఫిగర్ ఎంత!


వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద శంకర వరప్రసాద్, వెంకీ గౌడ, శశిరేఖ, అనిల్ రావిపూడి(Anilravipudi)చేస్తున్న హంగామాకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. రిలీజ్ రోజున ఏ స్థాయిలో అయితే అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితి. ఈ విషయంలో అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కలెక్షన్స్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు శంకర వర ప్రసాద్ ఖాతాలోకి చేరుతున్నాయి. మరి ఆరు రోజులకే 261 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన శంకర వరప్రసాద్ నిన్నటితో మొదటి వారం కంప్లీట్ చేసుకొని రెండవ వారంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

మన శంకర వరప్రసాద్ నిన్న ఏడవ రోజున 31 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. దీంతో మొత్తం ఏడు రోజులకి 292 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లయింది. మేకర్స్ కూడా అధికారంగా ధ్రువీకరిస్తు పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక్కడ ఇంకో అరుదైన రికార్డు ఏంటంటే ఏడవ రోజు తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి 31 కోట్ల గ్రాస్ ని రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా కూడా శంకర వర ప్రసాద్ నిలిచింది. దీన్ని బట్టి శంకర వర ప్రసాద్ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం థియేటర్స్ లో శంకర వరప్రసాద్ తో పాటు సంక్రాంతికి వచ్చిన మరికొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇతర భారీ చిత్రాల రాక కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నెల రోజుల పాటు లేదు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ కే 292 కోట్ల గ్రాస్ ని శంకర వర ప్రసాద్ రాబట్టడంతో టోటల్ రన్ లో సాధించే కలెక్షన్స్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

Also read: రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. అతనికి బుద్ధి అనేది ఉందా

ఓవర్ సీస్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పటికే 2 .96 మిలియన్ల క్లబ్ లో చేరి మూడు మిలియన్ల క్లబ్ లోకి చేరువ కానుంది. దీంతో చిరంజీవి(Chiranjeevi)కెరీర్ లోనే ఆ ఘనత అందుకోబోతున్న తొలి చిత్రంగా శంకర వరప్రసాద్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలవబోతుంది.