English | Telugu

రెహ్మాన్ పై జాలి చూపించవద్దు.. ఇవిగో సాక్ష్యాలు 


-ట్విట్టర్ ఏం చెప్తుంది
-బంగ్లాదేశ్ రచయిత్రి ఆంతర్యం ఏంటి
-అసలు మ్యాటర్ ఇదేనా!


భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా నిలిచిన మ్యూజిక్ మెషిన్ 'ఏ ఆర్ రెహ్మాన్'(Ar Rehman)ఇటీవల మాట్లాడుతు అవకాశాల విషయాల్లో బాలీవుడ్ లో మతపరమైన వివక్ష ఉందేమో అనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై రెహ్మాన్ వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఈ ఎంటైర్ విషయం మొత్తంపై రచయిత్రి తస్లిమా నస్రీన్(Taslima nasreen) సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించింది.


ఎక్స్ వేదికగా రెహ్మాన్ విషయంపై నస్రిన్ స్పందిస్తు 'రెహ్మాన్ భారత్ లో చాలా పేరు పొందిన వ్యక్తి. నాకు తెలిసి రెమ్యునరేషన్ పరంగా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే ఎక్కువ. మతపరమైన కారణాలతో పని దొరకడం లేదని ఆయన చెప్పారు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జావేద్ ఖాన్ లాగానే రెహ్మాన్ సూపర్ స్టార్. పని విషయంలో వీళ్ళకి మతం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. కాబట్టి రెహ్మాన్ ని చూసి ఎవరు జాలిపడవద్దు అని ట్వీట్ చేసింది.

Also read: లెజండ్రీ హీరోయిన్ చావుకి బ్లాక్ మ్యాజిక్ కారణమా! ఆమె భర్త ఏం చెప్పాడు

బంగ్లాదేశ్ కి చెందిన నస్రీన్ రచయిత్రి గా తన పుస్తకాలతో ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ వస్తుంది. ప్రపంచ మహిళా హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో పాటు పక్కా సెక్యులర్ వాది. ఈ విషయంలో ఆమెపై ఎన్నోసార్లు దాడి జరిగినా కూడా తన ఆలోచనల్ని, భావాలని చెప్పే విషయంలో ఎలాంటి బెరుకు లేకుండా ముందుకెళ్తుంది.