ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక వ్యాఖ్యలు
on Jan 19, 2026

-ఆసక్తికరంగా రష్మిక వ్యాఖ్యలు
-తన వ్యాఖ్యల్లో మర్మమేంటి
-వాళ్ళు కూడా బతకాలిగా
-ఇంతకీ ఏమని చెప్పింది
వరుస పాన్ ఇండియా హిట్స్ తో దూసుకుపోతు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న(Rashmika Mandanna). పైగా అతి తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయి ఇమేజ్ ని పొందిందంటే రష్మిక కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. భారీ అభిమాన ఘనం కూడా ఆమె సొంతం. రీసెంట్ గా తన కెరీర్ కి సంబంధించి రష్మిక చెప్పిన కొన్ని విషయాలు అభిమానులు, మూవీ లవర్స్ తో పాటు ఫిలిం సర్కిల్స్ లో సరికొత్త చర్చకి దారితీశాయి. అంతలా చర్చకి దారి తీసిన అంశాలేంటో చూద్దాం.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతు 'కొంత మంది వ్యూస్ తో డబ్బు సంపాదించడం కోసం ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా బతకాలి కదా అనిపిస్తుంది. ఇండస్ట్రీ లో ఉన్న వారికి నెగిటివిటి కామన్. ఆ విషయంలో ఎవరు మారడం లేదు. నేను ఎక్కువ పారితోషకం తీసుకుంటాననే రూమర్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదు. కానీ సదరు న్యూస్ నిజమైతే బాగుండని ఎన్నో సార్లు అనుకుంటాను. స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి నేను ఓకే. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ అయ్యి ఉండాలి.
Also read: ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. తొలి తెలుగు చిత్రమని మేకర్స్ ప్రకటన
కానీ ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వాళ్ళు అడిగితే మాత్రం వాళ్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తాను. ప్రస్తుతం నేను హీరోయిన్ ని కాబట్టి ప్రేక్షకులకి వినోదాన్ని పంచడమే నా పని. అందుకే ప్రేక్షకుల్లో అన్ని రకాల జోనర్స్ వాళ్ళు ఉంటారని మాగ్జిమమ్ అన్ని రకాల జోనర్స్ లో చేస్తూ వస్తున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇక స్పెషల్ సాంగ్ వ్యాఖ్యలపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా పలు రీతుల్లో స్పందిస్తున్నారు. ప్రీవియస్ మూవీ గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక మరో మారు తన పెర్ ఫార్మెన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాక్ టైల్ 2 , మైసా వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మిక ఖాతాలో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



