English | Telugu
పైసా కథ ఇంతేనా...?
Updated : Feb 7, 2014
కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన తాజా చిత్రం "పైసా". ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయం మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఎన్నో నెలలకు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకొని, విడుదలకు నోచుకోని ఈ సినిమా.. ఎట్టకేలకు నేడు విడుదలవుతుంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. మరి అంత నమ్మకంతో వీళ్ళు ఎందుకున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటి? అనేది ఒకసారి చూద్దామా...!
నాని(ప్రకాష్) పాతబస్తీలోని షేర్వానీ దుకాణంలో మోడల్ గా పనిచేస్తుంటాడు. డబ్బు పిచ్చి బాగా ఎక్కువ. ఎదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు. దానికోసం ఏమైనా చేసేస్తాడు. కేథరిన్ (నూర్జహాన్) సంప్రదాయక ముస్లిం యువతి. నలుగురిలో మాట్లాడటానికి భయం, మొహమాటం. అలాంటి అమ్మాయి ప్రకాష్ కు దగ్గరవుతుంది. అయితే అనుకోకుండా ప్రకాష్ కోట్ల రూపాయలు కలిసొచ్చే వ్యవహారం ఆచూకీ తెలుస్తుంది. మరి ఆ డబ్బును ఎలా సంపాదించుకున్నాడు? ప్రకాష్ కు నూర్జహాన్ ఎలాంటి సహాయం చేస్తుంది? ఆ డబ్బు కోసం ఎలాంటి సాహసాలు చేసారు? అనే విషయాలు వెండితెరపై చూస్తేనే బాగుంటుంది.
Anurag Srivastava speaking about Social Media