English | Telugu

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో రివ్యూ

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో రివ్యూ

చిత్రం : "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో"

సంస్థ : హరిత ఎంటర్ టైన్మెంట్స్

రేటింగ్ : అంకెలు మర్చిపోయాం.

దర్శకత్వం : ఉదయ్ రాజ్

నిర్మాత : మల్లెల సీతారామరాజు

సంగీతం : రఘురాం

శ్రీకాంత్ హీరోగా నటించిన "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో" సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదం అందించిందో... అసలు ఈ సినిమా కథ ఏంటో ఒకసారి చూద్దామా...!

కథ : శ్రీకాంత్(మల్లిగాడు) "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో" అనే పేరుతో ఓ మ్యారేజ్ బ్యూరో నడుపుతాడు. జరగవని తెలిసిన పెళ్ళిళ్ళను ఇతను జరిపించడానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకే 1 ఇయర్ మాత్రమే గ్యారెంటీ అని పెడతాడు. అక్కడే దాదాగా చెలామని అవుతున్న బ్రహ్మానందం పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి పోలీస్ ఆఫీసర్ అయిన పోసాని కృష్ణమురళి వలన వస్తుంది. పెళ్లిచేసుకోకపోతే చంపేస్తాను అంటూ బ్రహ్మీని వార్నింగ్ ఇస్తాడు పోసాని. దాంతో బ్రహ్మీ ఈ మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు. అదే విధంగా ఎప్పటినుంచే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తెలంగాణ శకుంతల కూడా ఈ బ్యూరోనే సంప్రదిస్తుంది. ఇదిలా ఉంటే.. హీరోయిన్ ఈ బ్యూరోలో ఒక మెంబర్ గా పనిచేస్తుంది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉండదు. కానీ తనకు పెళ్లి గురించి వివరించి శ్రీకాంత్ తన ప్రేమలో పడిపోతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే బ్రహ్మీ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు.. శ్రీకాంత్ చెల్లెలే. కాబట్టి.. బ్రహ్మీకి తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయడం ఎలాగో జరగని పని.. కాబట్టి బ్రహ్మీని మోసం చేస్తూ సరదాగా అతడిని ఆటపట్టిస్తూ సినిమా అలా నడుస్తూ ఉంటుంది. అయితే చివరకు ఏమైంది? ఎవరెవరికి పెళ్లి జరిగింది? అనే విషయాలు థియేటర్లోనే చూస్తే బాగుంటుంది.

నటీనటులు : శ్రీకాంత్ తన పాత్రకు న్యాయం చేసాడు. హీరోయిన్ పర్వాలేదనిపించింది. బ్రహ్మీ, పోసాని, తెలంగాణ శకుంతల, వెన్నెల కిషోర్ వంటి నటులు కూడా ఎవరి పాత్రల్లో వారు పర్వాలేదు అని అన్నట్లుగా చేసారు.

సాంకేతిక వర్గం : దర్శకుడు ఉదయ్ రాజ్ కథ, కథనంపై మరింత దృష్టి పెడితే బాగుండేది. సినిమా మొత్తం రుచి,పచి లేని కామెడితో నడిపించేసాడు. అర్థం పర్ధం లేని సన్నివేశాలతో జనాలను నవ్విద్దామని అనుకున్నాడు. రఘురాం సంగీతం బాగుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. కెమెరామెన్..... చిత్రీకరణ బాగుంది. నిర్మాత కథను నమ్మి ఈ సినిమా తీసాడా? లేక శ్రీకాంత్ ను నమ్మి ఈ సినిమా తీసాడా అనేది అర్థం కాలేదు.

ప్లస్ పాయింట్స్ : పాటలు.

మైనస్ పాయింట్స్ : లిస్ట్ చాలా పెద్దది.

చివరగా : "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో" గ్యారంటీ లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.