English | Telugu
మొన్న మహేష్.. నేడు ఎన్టీఆర్.. మరి రేపు..?
Updated : Feb 6, 2014
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "బసంతి". ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీనువైట్ల సంయుక్తంగా విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను హీరో ఎన్టీఆర్, దర్శకుడు వి.వి.వినాయక్ కలిసి విడుదల చేసారు. మణిశర్మ సంగీతం అందించాడు. చైతన్య దంతులూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలీషా బేగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ చిత్రంలోని మరో పాటను ఏ హీరో విడుదల చేస్తాడో త్వరలోనే తెలియనుంది.