English | Telugu
సలార్ సాంగ్స్.. ఒకటి అమ్మ పాట, ఇంకోటి ఐటెం పాట!
Updated : Nov 9, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సాంగ్స్ కి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇందులో కేవలం రెండు పాటలే ఉంటాయట. అందులో ఒకటి అమ్మ పాట, ఇంకోటి ఐటెం పాట అని తెలుస్తోంది.
'సలార్'లో రెండు పాటలే ఉన్నాయని.. అవి కూడా ఒకటి అమ్మ పాట, రెండోది ఐటెం పాట అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచే వార్త. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో 'కేజీఎఫ్'తో తెలిసింది. ఇక ఆ ఎలివేషన్స్ కి తగ్గట్టుగా 'సలాం రాకీ భాయ్', 'ధీరా ధీరా' వంటి పాటలు ఆ హీరోయిజాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళాయి. సలార్ లో కూడా ఆ స్థాయి ఎలివేషన్స్, సాంగ్స్ ఉంటాయని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు హీరో ఎలివేషన్ సాంగ్స్ లేవనే న్యూస్ తో వాళ్ళు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. సలార్ హీరో ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఆ సీన్స్ కి తగ్గట్టుగా కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయని వినికిడి.
'కేజీఎఫ్' విజయంలో అమ్మ సెంటిమెంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సలార్ లో అమ్మ పాట ఉందంటే.. ప్రశాంత్ నీల్ మరోసారి మదర్ సెంటిమెంట్ తో పిండేస్తాడు అనడంలో సందేహం లేదు. ఇక ఐటెం సాంగ్ కూడా ఒక ఊపు ఊపేలా ఉంటుందట. ఈ స్పెషల్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ సందడి చేయనుందని సమాచారం.