English | Telugu
విజయవాడలో భారతీయుడు 2 మూవీ షూటింగ్
Updated : Nov 9, 2023
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శక శిఖరం శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 .తెలుగులో భారతీయుడు 2 గా రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా వచ్చిన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది.1996 వ సంవత్సరంలో తెలుగులో భారతీయుడు అనే పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించిన భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా భారతీయుడు 2 మూవీ తెరకెక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన నయా అప్ డేట్ ఒకటి తెలుగు ప్రేక్షకుల్లో హుషారుని నింపుతుంది.
భారతీయుడు 2 చిత్రం షూటింగ్ ని దర్శకుడు శంకర్ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నాడు. అందులో భాగంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అయిన విజయవాడ నగరంలో శంకర్ భారతీయుడు 2 చిత్రం షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నాడు. విజయవాడ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన గాంధీనగర్ మరియు పరిసర ప్రాంతాల్లో భారతీయుడు మూవీ షూటింగ్ జరగబోతుంది. సుమారు ఎనిమిది వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో శంకర్ అత్యంత భారీగా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నాడు. శంకర్ విజయవాడ లో తెరకెక్కించే సీన్స్ అన్ని కూడా మూవీలో అత్యంత కీలకమైనవిగా తెలుస్తుంది.
ఎన్నో సంవత్సరాల నుంచే కమల్ అండ్ శంకర్ లు తెలుగు సినిమా ప్రేక్షకులకి సుపరిచితులు. కమల్ నటించిన ఎన్నో సినిమాలు అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు నాట కలెక్షన్ ల వర్షాన్ని కురిపించాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం భారతీయుడు కూడా తెలుగులో ఘన విజయం సాధించడంతో పాటు రికార్డు కలెక్షన్ లని సాధించింది. ఇప్పుడు భారతీయుడు 2 మూవీ కూడా రికార్డు కల్లెక్షన్లని సాధించటం ఖాయమని కమల్ అండ్ శంకర్ అభిమానులు భావిస్తున్నారు.