English | Telugu
జాతీయ ఉత్తమ నటుడికి దక్కిన అరుదైన గౌరవం
Updated : Aug 29, 2023
జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ‘పుష్ప’ చిత్రంలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు సినీ, రాజకీయ ప్రముఖులెందరో అభినందనలు తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అభినందించి, సత్కరించడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌గా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఒక కళాకారుడ్ని గౌరవించి తనే ఇంటికి వచ్చి అభినందించడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన దత్తాత్రేయను అల్లు అర్జున్ స్వయంగా ఇంటిలోకి ఆహ్వానించి గౌరవించారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు దత్తాత్రేయ. కొంత సమయం అల్లు అర్జున్‌తో గడిపి తన సంతోషాన్ని పంచుకున్నారు దత్తాత్రేయ.