English | Telugu

ఎన్టీఆర్ ని కలిసిన త్రివిక్రమ్.. 'గాడ్ ఆఫ్ వార్' మళ్ళీ చేతులు మారిందా?

'గాడ్ ఆఫ్ వార్' హీరో ఎవరు?
ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య దోబూచులాట
ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఎందుకు కలిశాడు?
కుమారస్వామి పాత్రలో ఎవరిని చూడబోతున్నాం?

కుమారస్వామి కథ ఆధారంగా త్రివిక్రమ్(Trivikram) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) ఈ సినిమా చేయాల్సి ఉండగా.. ఆయన అనూహ్యంగా అట్లీ ప్రాజెక్ట్ తో బిజీగా కావడంతో.. ఈ మైథలాజికల్ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చేతికి వెళ్ళిపోయింది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఎన్టీఆర్ నుండి బన్నీ చేతికి వెళ్ళిపోయినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. దీంతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ లలో అసలు కుమారస్వామిగా ఎవరు నటిస్తారనే చర్చ తెగ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ కలిశాడనే వార్త మరింత ఆసక్తికరంగా మారింది. (God of War)

ఒక సినిమా ఇలా ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య దోబూచులాడటం అనేది ఇప్పుడు కొత్త కాదు. గతంలో 'దేవర' విషయంలోనూ ఇలాగే జరిగింది. 'జనతా గ్యారేజ్' తరువాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో.. యువసుధ ఆర్ట్స్ తమ మొదటి ప్రొడక్షన్ గా 2017లో ఒక సినిమాని ప్రకటించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని 2020లో అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసింది. చివరికి మళ్ళీ ఇది ఎన్టీఆర్ చేతికే వచ్చి.. 'దేవర'గా తెరకెక్కింది. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే జరుగనుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి 'అరవింద సమేత' తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 2020లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కలయికలో 2023లో సినిమా ప్రకటన వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వచ్చింది. ఇటీవల మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరకే వెళ్లినట్టు ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ కలవడంతో.. కుమారస్వామిగా ఎన్టీఆర్ నటించడం ఖాయమేనా? అనే చర్చ జరుగుతోంది.

Also Read: శంబాల మూవీ రివ్యూ

మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ ని కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిశాడు. బన్నీ-లోకేష్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని, జనవరిలో ప్రకటన రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నెక్స్ట్ రెండు సినిమాలు ఫిక్స్ అయ్యాయని, త్వరలో ప్రకటన వస్తుందని ఇటీవల నిర్మాత బన్నీ వాసు చెప్పారు. మరి అందులో ఒకటి లోకేష్ ప్రాజెక్ట్ అయితే.. రెండో దానికి దర్శకుడు త్రివిక్రమా? లేక మరెవరైనా రంగంలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

చూద్దాం మారి.. దేవర విషయంలో జరిగినట్టుగా 'గాడ్ ఆఫ్ వార్' మళ్ళీ ఎన్టీఆర్ చేతికే వస్తుందా? లేక ఈసారి ఆ అవకాశాన్ని అల్లు అర్జున్ కొట్టేస్తాడా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.