English | Telugu

ఛాంపియన్ ఫస్ట్ డే కలెక్షన్ ఇవే!.. నిజమేనంటారా!

-కలెక్షన్స్ ఇవేనా!
-మూవీకి అయితే పర్వాలేదనే టాక్
-రోషన్ పెర్ ఫార్మెన్స్ కి ఫిదా

తెలుగు చిత్ర పరిశమ్రలో సుదీర్ఘ కాలంగా రాణిస్తూ తన కంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్(Srikanth).ఆయన తనయుడు రోషన్(Roshan)నిన్న క్రిస్మస్ కానుకగా 'ఛాంపియన్'(Champion)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంతో కూడిన తెలంగాణని పరిపాలిస్తున్ననిజాం పాలకుల ఇండియాలో కలవడానికి ఇష్టపడరు. దీంతో సిద్ధిపేట జిల్లాలో ఉన్న బైరాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రజలు నిజాం దాష్టీకాలకి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపుతారు. వీరితో ఇంగ్లాండ్ దేశంలో సెటిల్ అవ్వాలకున్న సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మైఖేల్ విలియమ్స్ అనే యువకుడు కూడా కలిసి పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోతాడు.ఈ కథ తోనే ఛాంపియన్ తెరకెక్కింది. మరి ఈ తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూద్దాం.


ఫస్ట్ డే 2.75 కోట్ల రూపాయలని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఈ కలెక్షన్స్ పై అధికార ప్రకటన రాకపోయినా రోషన్ గత చిత్రాలతో పోలిస్తే ఛాంపియన్ కి బాగానే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. మూవీ చూసిన ప్రేక్షకులు అయితే పర్వాలేదనే స్థాయిలో ఉందని, మైకేల్ విలియమ్స్ క్యారక్టర్ లో మాత్రం రోషన్ నటన అత్యద్భుతంగా ఉందని చెప్తున్నారు. రివ్యూస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీకెండ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందనే ఆసక్తి నెలకొని ఉంది.

Also read: ఛాంపియన్ మూవీ రివ్యూ.. హిట్టా, ఫట్టా


ఇక ఈ మూవీ ఎంత బడ్జెట్ తో తెరకెక్కిందో అని మేకర్స్ అధికారంగా వెల్లడి చేయకోపోయినా. ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై మూవీ చూస్తుంటే మాత్రం ముపై కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువే అయినట్టుగా ఉంది. అంతలా మేకర్స్ అయిన స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ మూవీస్ గ్రాండ్ గా నిర్మించాయి. రోషన్ సరసన అనస్వర రాజన్(Anaswara Rajan) జత కట్టగా ప్రదీప్ అద్వైతం(Pradeep advaitham)దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీత సారధ్యం వహించాడు.


.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.