English | Telugu

దండోరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!

-మూవీకి అయితే పాజిటివ్ బజ్
-మరి ఈ కలెక్షన్స్ ఏంటి!
-మెస్మరైజ్ చేస్తున్న ఆర్టిసుల పెర్ ఫార్మెన్స్


తెలంగాణ ప్రాంతంలోని తుళ్లూరు అనే గ్రామంలో నివసిస్తున్న అనేక వర్గాల ప్రజల మధ్య నెలకొని ఉన్న కులతత్వం, ప్రేమలు, పౌరుషాలు, పగలు, పెత్తనాలు వంటి పలు భావోద్వేగాల్ని బేస్ చేసుకొని తెరకెక్కిన చిత్రం దండోరా(Dhandoraa). అనాదిగా పలు గ్రామాల్లో ఎదుర్కుంటున్న సమస్యకి ఒక చక్కని పరిష్కారం కూడా చెప్పి ఎంతో మందికి కనువిప్పుని కలిగించింది. మరి క్రిస్మస్ కానుకగానిన్న థియేటర్స్ లో అడుగుపెట్టగా తొలి రోజు ఎంత మేర కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.


ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు 22 లక్షల రూపాయలు రాబట్టినట్టుగా చెప్తున్నారు. మూవీ చూసినచాలా మంది ప్రేక్షకులు అయితే కొత్త దర్శకుడైనా కూడా ముర‌ళీకాంత్‌ దేవ సోత్(Murali Kantha devasoth)దండోరా ని బాగానే తెరకెక్కించాడని, చాలా సన్నివేశాలు హృదయాన్ని తాకాయని, శివాజీ(Sivaji),నవదీప్, రవికిషన్, నందు, బిందు మాదవి తో పాటు మిగతా నటి నటులంతా ఎంతో అద్భుతంగా చేసారని చెప్తున్నారు. మరి కలెక్షన్స్ మాత్రం అంత తక్కువ స్థాయిలో రావడం ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరుస్తుంది.

Also Read: దండోరా మూవీ రివ్యూ

సినీ సర్కిల్స్ లో మాత్రం నిన్న దండోరా తో పాటు ఐదు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడంతో చాలా తక్కువ స్థాయిలో థియేటర్స్ దక్కాయనే టాక్ వినపడుతుంది. రివ్యూస్ అయితే పాజిటివ్ గానే వస్తున్నాయి.మూవీ ఆడుతున్న థియేటర్స్ లో అయితే ప్రేక్షకుల సందడి మాత్రం బాగానే కనపడుతుంది. కలర్ ఫోటో మూవీని నిర్మించిన లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ దండోరా ని నిర్మించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.