English | Telugu
ఎన్టీఆర్ అభిమానులకి ఇక పండగే...
Updated : Oct 2, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి ఉన్న స్టామినా గురించి కొత్తగా ఎవరు చెప్పుకోవలసిన అవసరం లేదు.సినిమా సినిమా కి అద్భుతమైన నటనని ప్రదర్శించి స్వయం కృషితో తన కంటూ కోట్లాదిమంది అభిమానులని సంపాదించాడు. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకి పండుగరోజు.అలాగే ఆయన రాబోయే సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు.తాజాగా శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఆయన నయా మూవీ దేవర కి సంబంధించిన ఒక పిక్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఇద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ తెలియచేసింది.ఒక పవర్ ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ఆ సినిమా లో నటించిన విధానం అలాగే కొరటాల శివ యొక్క రచన,దర్సకత్వం జనతా గ్యారేజ్ మూవీని సూపర్ డూపర్ హిట్ చేసాయి.ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో దేవర మూవీ రాబోతుంది.ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ యమా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఆల్రెడీ మూవీలో ఎన్టీఆర్ గెటప్ ఎలా ఉంటుందో చెప్పి ఎన్టీఆర్ గెటప్ ని రిలీజ్ చేస్తే రికార్డు స్థాయిలో వ్యూరెస్ ని సంపాదించుకుంది.దీంతో మూవీ మీద ఎన్టీఆర్ అభిమానులు ఒక లెవెల్లో అంచనాలని పెంచేసుకుంటున్నారు.అలాగే సినీ వర్గాల్లో కూడా దేవర మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి.
ఇంక అసలు విషయానికి వస్తే దేవర మూవీకి ఫోటోగ్రఫీ ని అందిస్తుంది ఇండియన్ సినిమా లో నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ గా ముందుకు దూసుకుపోతున్న రత్నవేలు అనే విషయం అందరికి తెలుసు.ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో దేవర మూవీ కి సంబంధించి ఎన్టీఆర్ మీద లేటెస్ట్ గా షూట్ జరుపుకున్న సీన్ గురించే చెప్పి వాటి తాలూకు ఫొటోస్ ని కూడా పోస్ట్ చేయడం తో ఎన్టీఆర్ అభిమానులు పూనకం తో ఊగిపోతున్నారు. నైట్ ఎఫెక్ట్ లో వాటర్ అడుగున వాటర్ పైన ఎన్టీఆర్ మీద అదిరిపోయే ఒక యాక్షన్ సీన్ ని పూర్తి చేసినట్లుగా రత్నవేలు చెప్పారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ బ్యానేర్స్ పై తెరకెక్కుతున్న ఈ దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.