English | Telugu
అరచేతితో సూర్యుడ్ని ఆపలేరు: మురళీమోహన్
Updated : Oct 2, 2023
ఎ.పి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. తాజాగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్... చంద్రబాబు అరెస్ట్‌పై పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
74 సంవత్సరాల చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టడం చాలా అన్యాయం. ఆయన హయాంలో ఐటి రంగం ఎంతో అభివృద్ది చెందింది. హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి బిల్‌గేట్స్‌ని ఆహ్వానించారు చంద్రబాబు. చంద్రబాబు ఎంత గొప్పవారో బిల్‌గేట్స్ మాటల్లో చెప్పాలంటే ‘నేను అమెరికాలో తప్ప ఇంకెక్కడా ఆఫీస్ పెట్టలేదు. ఒక వేళ ఇండియాకి వస్తే మొదటి ఆఫీసు మీ దగ్గరే పెడతాను’ అని అన్నారంటే చంద్రబాబు గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో ఐటి రంగాన్ని ప్రవేశ పెట్ట ఘనత ఆయనకే దక్కుతుంది. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఢల్లీి పార్లమెంట్ దగ్గర దీని గురించి చర్చించాం. ఆయన తొందరగా బయటికి రావాలి అని ,దాంతోపాటు రాజ్ ఘాట్‌కి వెళ్లి అక్కడ ఒక అరగంట వేడుకున్నాము. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి. అరచేయితో సూర్యుని ఆపలేము గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు.