English | Telugu
ఓ నటుడి ఆవేదన.. రక్తంతో ప్రధాని మోదీకి లేఖ!
Updated : Oct 2, 2023
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ నటుడు రక్తంతో రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్ళుగా కావేరీ జలాల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు వాటాగా నీటిని విడుదల చెయ్యడంతో మళ్ళీ కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. అందరూ ఈ విషయంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనల వల్ల సమస్య పరిష్కారం కాదని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకొని సామరస్యంగా మాట్లాడుకుంటే ఫలితం ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంలో న్యాయం చెయ్యాలని కోరుతూ ప్రముఖ కన్నడ నటుడు ప్రేమ్ ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో లేఖ రాశారు. అందులో ‘ప్రధాని నరేంద్ర మోదీ గారికి.. కర్ణాటకకు, కావేరీకి న్యాయం చేయండి. కావేరీ మాది’’ అని రాసి ఉంది. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని, అలా జరిగితేనే సమస్య తీరుతుందని అంటున్నారు. లేకపోతే ఆందోళనలు మరింత పెరిగే అవకాశం వుందని, ఇప్పటికైనా ప్రధాని మోది ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.