English | Telugu
విశాల్‌కి ప్రభాస్ వల్ల బాగా కలిసొచ్చింది!
Updated : Sep 8, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లోరిలీజ్‌కు దగ్గరగా ఉన్న సినిమా ‘సలార్’. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది. కానీ వి.ఎఫ్.ఎక్స్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హ్యాపీగా ఫీల్ కాకపోవటంతో పోస్ట్ పోన్ చేస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ డేట్‌లో మిగతా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక అధికారిక ప్రకటన ఒకటే మిగిలిందని అందరూ అనుకుంటున్నారు. ‘సలార్’ అనుకోకుండా వాయిదా పడటం ఆయన ఫ్యాన్స్‌ని కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ ఏం చేద్దాం పరిస్థితులు అనుకూలించాలి.. ఔట్‌పుట్ బావుండాలిగా అని సరిపెట్టుకున్నారు.
అయితే కొందరు తెలుగు నిర్మాతలు మాత్రం ‘సలార్’పై కాస్త గుర్రుగానే ఉన్నారు. అందుకు కారణం ‘సలార్’ సినిమాకున్న క్రేజ్ కారణంగా సెప్టెంబర్ 28న ఆ డేట్‌ను ఫ్రీగా వదిలేసి మేకర్స్ సెప్టెంబర్ 15 తేదీన వారి సినిమా రిలీజ్‌లను ప్లాన్ చేసుకున్నారు. అందుకు కారణంగా వినాయక చవితి కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఆ లిస్టులో విశాల్ మార్క్ ఆంటోని, రామ్ పోతినేని స్కంద, లారెన్స్ - కంగనా రనౌత్ మూవీ చంద్రముఖి 2 కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్టులోనుంచి ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. అవేంటంటే ఒకటి స్కంద. దీన్ని సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 కూడా సెప్టెంబర్ 28కే వెళ్లింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దీంతో సెప్టెంబర్ 15న డబ్బింగ్ సినిమా అయిన మార్క్ ఆంటోని మాత్రమే సోలో రిలీజ్ కానుంది. నిజానికి సలార్ మేకర్స్ సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉండుంటే ఈ వినాయక చవితికి తెలుగు సినిమా ఒకటైనా రిలీజ్‌కి వచ్చుండేది. కానీ ఇప్పుడు ఈసారి వినాయక చతుర్థికి ఓ తెలుగు సినిమా కూడా రిలీజ్ కావటం లేదు. విశాల్‌కి అలా లక్ కలిసొస్తుంది మరి.