English | Telugu
‘సలార్’ ట్రైలర్ రికార్డు సృష్టిస్తోంది.. ఇప్పుడు రెండో ట్రైలర్ రాబోతోంది!
Updated : Dec 3, 2023
ఈమధ్యకాలంలో ఎంతో హైప్ తెచ్చుకున్న సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 110 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూడు రోజుల్లో 135 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి ముందుకు దూసుకెళ్తోంది. ఈ ట్రైలర్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ‘సలార్’ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్‌తో సరిపెట్టడంలేదు ప్రశాంత్ నీల్. మరో ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఈనెల 15`18 తేదీల మధ్య రిలీజ్ కానుంది. మొదటి ట్రైలర్ 3 నిమిషాలపైన ఉన్నప్పటికీ అందులో ప్రభాస్ కనిపించింది కాసేపే. అందుకే మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారు మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ ట్రైలర్‌లా కాకుండా ఒక ఇంపార్టెంట్ యాక్షన్ కట్‌తో ఉంటుందట. అలాగే దీనికి ట్రైలర్ అని కాకుండా మరో కొత్త పేరు పెడతారని తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగానికి ‘సలార్ సీజ్‌ఫైర్’ అనే పేరు పెట్టారు. అయితే సెకండ్ పార్ట్‌కి సలార్ టైటిల్‌తో ఏ పదాన్ని జోడిస్తారో చూడాలి. డిసెంబర్ 22న విడుదల కాబోతున్న ‘సలార్ సీజ్‌ఫైర్’ డెఫినెట్ భారీ కలెక్షన్లు సాధిస్తుందని ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్‌ని బట్టే తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.