English | Telugu

‘లియో’ ఓటీటీ రిలీజ్‌ విషయంలో షాక్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌!

దళపతి విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ దసరాకి రిలీజ్‌ అయి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే ఈ సినిమాకు రెండు తేదీలను ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ‘లియో’ అక్టోబర్‌ 19న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఆడియన్స్‌ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ కలెక్షన్స్‌ మాత్రం దుమ్ము లేపింది. మొదటి రోజే వరల్డ్‌ వైడ్‌గా రూ.140 కోట్ల భారీ ఓపెనింగ్స్‌ అందుకున్న ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని కోలీవుడ్లో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదిలా ఉంటే లియో ఓటీటీ రిలీజ్‌ కోసం విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ రిలీజ్‌ కంటే ముందు ఆన్‌ లైన్‌ ఈ మూవీ లీక్‌ అవ్వడంతో అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారని, నవంబర్‌ 16 నుంచి ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, నవంబర్‌ 16న ‘లియో’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రాలేదు.

దీంతో సినీ లవర్స్‌ నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే నెట్‌ ఫ్లిక్స్‌ ‘లియో’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో పాటూ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్‌ కూడా ఇచ్చింది. అదేంటంటే, ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించింది. దాని ప్రకారం ఇండియాలో ‘లియో’ నవంబర్‌ 24న ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నట్లు వెల్లడిరచింది. ఇక గ్లోబల్‌ వైడ్‌గా మాత్రం నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానున్నట్లు అనౌన్స్‌ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు నెట్‌ ఫ్లిక్స్‌ ప్రకటించింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని సుమారు రూ.120 కోట్లకు నెట్‌ ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .