English | Telugu

మహేష్ బాబుకి అన్యాయం చేస్తున్నఅభిమానులు  

ఏ హీరోకైనా అభిమానులే బలం.వాళ్ళు చూపించే అభిమానమే ఆ హీరోకి మంచి మంచి సినిమాలు తియ్యడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. కానీ ప్రిన్స్ మహేష్ బాబు విషయంలో మాత్రం అభిమానుల అత్యుత్సాహం ఆయనకి తలనొప్పిగా మారుతుంది. ఆయన తాజా చిత్రం గుంటూరు కారం మూవీ షూటింగ్ స్టార్ట్ నుంచే లీక్ ల బారిన పడుతు వస్తుంది. అదంతా కొంత మంది మహేష్ అభిమానుల పుణ్యమే. ఇప్పుడు మరో లీక్ తో మహేష్ అభిమానులు టాక్ అఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీ గా మారారు.

గుంటూరు కారం మూవీ టైటిల్ సాంగ్ కి సంబంధించి మహేష్ బాబు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోని చూసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. మహేష్ బాబుని చూడటానికి వచ్చిన కొంతమంది అభిమానులే మహేష్ డాన్స్ వీడియో తీసి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఉంటారని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ మధ్య కాలంలో లీక్ ల బారిన పడిన తెలుగు సినిమా ఏదైనా ఉంది అంటే అది గుంటూరుకారం మూవీనే అని చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సార్లు సినిమాకి సంబంధించిన చాలా వాటిని చిత్ర యూనిట్ అధికారంగా రిలీజ్ చెయ్యకుండానే లీక్ అయ్యాయి. మహేష్ వన్ మాన్ షో గా తెరకెక్కతున్న గుంటూరుకారం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈమూవీ కోసం ఎదురు చూడని సినీ ప్రేక్షకుడు లేడు. ఇక నుంచైనా గుంటూరుకారంని లీక్ ల బారి నుంచి కాపాడటానికి పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలని మహేష్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.