English | Telugu

అమెరికా వెళితే.. సెల్ఫీ వీడియోతో‌ క్షమాపణలు చెప్పాల్సిందే!

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమ సత్తా చాటుకున్నారు. ఇంకా కొత్తవాళ్ళు వస్తున్నారు. అలా బుల్లితెరపై తమని తాము నిరూపించుకొని వెండితెరపై అవకాశాలను వెతుక్కుంటూ కొత్తగా నటించడానికి వస్తున్నారు. అలాంటి వారిలో వేణు వెల్దండి, ధన్ రాజ్, షకలక శంకర్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఉన్నారు.

చిన్నపిల్లలతో కలిసి స్కిట్ చేయడం మాములు విషయం కాదు అలాంటిది చిన్నపిల్లలని టీమ్ లో చేర్చుకొని స్కిట్ లలో ఫన్ కలిగిస్తూ ప్రేక్షకులని నవ్విస్తున్నాడు రాకింగ్ రాకేష్.
రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు జబర్దస్త్‌ స్టేజి మీద వీరిద్దరి జోడీకి ఎంతో క్రేజ్‌ ఉంది.

తాజాగా రాకింగ్ రాకేష్ తెలుగువన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు. అమెరికాలో జరిగే తానా, నాటా ఈవెంట్లకి వెళ్తుంటారు కదా? పేమెంట్స్ ఎలా ఉంటాయని అడుగగా.. పేమెంట్ అనేది ఒక్కో ఆర్టిస్ట్ ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన దగ్గరి నుండి ఫుడ్, వసతి అన్నీ వాళ్ళే చూసుకుంటారు. తెలుగువాళ్ళని బాగా చేసుకుంటారని రాకేష్ అన్నాడు. స్కిట్ లలో మీకు మీరే పంచులేసుకుంటారు ఎందుకని అడుగగా.. వేరేవాళ్ళ మీద పంచ్ లు వేస్తే ఎవరు ఊరుకుంటారు. ఒకవేళ ఎవరిమీదైన పంచులు వేస్తే కాంట్రవర్సీ.. సెల్ఫీ వీడియోతో‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని రాకేష్ అన్నాడు. పిల్లలతో స్కిట్ చేపించుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి కదా అని అడుగగా.. అవును. నాకు ఓపిక హైదరాబాద్ కి వచ్చినప్పుడే వచ్చింది‌. చాలా పడ్డాను. అన్నీ అనుభవించాను. అయిన పెద్దొళ్ళ కంటే పిల్లలే బెస్ట్ అని రాకేష్ అన్నాడు. మనం ఏది రాస్తామో పిల్లలు అది చెప్తారు. కానీ పెద్దొళ్ళు అలా కాదు. స్టేజ్ మీదకి వెళ్ళాక ఏదో ఏదో చేస్తారని రాకేష్ అన్నాడు. పిల్లలతో కలిసి స్కిట్ చేయాలంటే వీడి తర్వాతే ఎవరైనా అంటూ గెటప్ శీను తనకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడంటూ గుర్తుకుచేసుకున్నాడు రాకేష్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.