English | Telugu
కలెక్షన్ కింగ్ మళ్ళీ వాడుకున్నాడట...!
Updated : Jan 29, 2014
ప్రముఖ నటుడు మోహన్ బాబు,హాస్యనటుడు బ్రహ్మానందంలపై రాష్ట్ర హైకోర్టులో బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కేసు వేసిన సంగతి అందరికి తెలిసిందే. పద్మశ్రీ అవార్డును సినిమాలకు వాడుకుంటున్నారని ఇంద్రసేనారెడ్డి కేసు వేసారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ మంగళవారం విచారణకు స్వీకరించింది. అయితే తాజాగా పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కూడా మోహన్ బాబు తన పేరుకు ముందు పద్మశ్రీని వాడుకున్నట్టు వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించినట్టు తెలిసింది. మరి ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.