English | Telugu

కారు డీ కొట్టింది..హాట్ హీరోయిన్ సేఫ్

ఇటీవలే యువ గాయకురాలు శ్రావణ భార్గవి రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో సినీ నటి కూడా రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడింది. ప్రముఖ హాట్ బ్యూటీ, నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఖుష్బు చెన్నైలోని తన ఇంటినుండి కారులో బయలుదేరింది. రెడ్ సిగ్నల్ పడడంతో జంక్షన్ దగ్గర ఆగింది. అయితే ఇంతలో సడెన్ గా సిటీ బస్సు వచ్చి ఖుష్బు కారును వెనుక భాగం నుండి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కారు వెనుకభాగం కూడా బాగా ధ్వంసమైంది. అదృష్టంకొద్ది కారులో ఉన్న ఖుష్బుకు మాత్రం ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

ఈ విషయం పై ఖుష్బు తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. "తన కెలాంటి ప్రమాదం జరగలేదని, అయితే ముందు వెళ్లే వెహికల్స్ ని చూడకుండా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై నాకు చాలా కోపం వచ్చింది. డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల నా కారు నాశనం అయింది. అతనిపై కంప్లయింట్ చేస్తే కోర్టు శిక్షించవచ్చు. కానీ ఆ డ్రైవర్ కుటుంబం నడిరోడ్డున పడుతుందని నేను ఆలోచించి కంప్లయింట్ చేయలేదు. కానీ ఈ ఖరీదైన కారును నా భర్త నాకు బహుమతిగా ఇచ్చారు. అలాంటి కారు ధ్వంసం కావడం బాధగా ఉంది" చెప్పింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.