English | Telugu
ఆయనకు మనం ఓ ఘనవీడ్కోలు
Updated : Jan 29, 2014
అక్కినేని నాగేశ్వరరావు ఇటీవలే మరణించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ క్రమంలో అక్కినేని చివరి దశలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనే కొన్ని విషయాలను అక్కినేని తనయుడు నాగార్జున తెలియజేశాడు. "ఆయనకు క్యాన్సర్ ఉన్న సంగతి తెలుసు. తాను జీవించి ఉన్నంతకాలం క్యాన్సర్‌తో పోరాడారని, ఓసారి తమ కుటుంబం తీస్తున్న "మనం" సినిమా సెట్స్ పై వుండగా కుప్పకూలిపోయారు. ఆయనకు క్యాన్సర్ ఐదో దశలో ఉన్నట్లు మాకు అప్పుడు తెలిసింది. అప్పటివరకు ఆయన మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు. "మనం" మూవీ 1920 నుంచి 2013 ల మధ్యకాలంలో సాగే సంఘటనల ఆధారంగా తెరకకెక్కింది. ఇందులో ఆయన 90ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. ఒక్కపాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని తెలిపారు. సినిమా కోసం డబ్బింగ్ పరికరాలన్నీ ఇంట్లోనే సిద్ధం చేయమన్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించేలోగా "మనం"లో తనకు సంబంధించిన డబ్బింగ్ చెప్పకపోతే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పిస్తావు అని అన్నారు. ఆయన అనుకున్నట్లుగానే డబ్బింగ్ చెప్పేసారు. ఇది మార్చి 31న రిలీజవుతోందని తెలిపారు. ఆయన చివరి సినిమా "మనం" ఓ ఘనమైన వీడ్కోలుగా వుండాలని కోరుకుంటున్నానని నాగార్జున అన్నారు.