English | Telugu
శెట్టి అండ్ శెట్టి గట్టిగానే కొట్టేశారు.. 4 రోజుల్లో రాబట్టిన వసూళ్ళు ఇవే!
Updated : Sep 11, 2023
బోల్డ్ పాయింట్ ని ఎలాంటి అసభ్యత లేకుండా తెరకెక్కించి.. విజయం అందుకోవడం అంత సులభతరం కాదు. అందునా.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ ముందు. అయితే, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. 'జవాన్' తుఫాన్ ముంగిట కూడా తొలి వారాంతంలో మంచి వసూళ్ళు రాబట్టిట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి, యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో నటించిన ఈ క్లాస్ మూవీ.. గురు, శుక్రవారాల్లో మంచి వసూళ్ళు చూసింది. ఇక శని, ఆది వారాల్లో అయితే అంతకంటే మెరుగైన కలెక్షన్స్ రాబట్టుకోవడం విశేషం.
రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 3 కోట్ల షేర్, సెకండ్ డే రూ. 2.26 కోట్ల షేర్ ఆర్జించగా, మూడో రోజైన శనివారం రూ. 3.58 కోట్ల షేర్, నాలుగో రోజైన ఆదివారం రూ. 4.36 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా.. ఈ నాలుగు రోజుల్లో రూ. 13. 20 కోట్ల షేర్ చూసింది. సోమవారం వచ్చే వసూళ్ళతో బ్రేక్ ఈవెన్ పక్కా అనే చెప్పొచ్చు. మండే టెస్ట్ లో పాసైమంచి వసూళ్ళు వస్తే.. ఇవాళ్టి నుంచే ప్రాఫిట్ జోన్ లోకి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వచ్చినట్టే. ఏదేమైనా.. శెట్టి అండ్ శెట్టి గట్టిగానే హిట్ కొట్టేశారని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.