English | Telugu

600 కోట్లు.. 300 మందికి బంగారు నాణేలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'జైలర్'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలై అంచనాలకు మించిన సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో నిర్మాత కళానిధి మారన్‌ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇప్పటికే రజినీకాంత్, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కి ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన ఆయన.. తాజాగా ఈ సినిమాకి పనిచేసిన 300 మందికి నాణేలను బహుకరించారు.

జైలర్ టీంతో చెన్నైలో తాజాగా నిర్మాత కళానిధి మారన్‌ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 కి పైగా యూనిట్ సభ్యులు పాల్గొనగా.. వారికి నిర్మాత గోల్డ్ కాయిన్స్ అందించారు. ఆ కాయిన్స్ పై ఒక వైపు జైలర్ టైటిల్, మరోవైపు సన్ పిక్చర్స్ లోగో ముద్రించి ఉన్నాయి. మొత్తానికి జైలర్ సినిమా సక్సెస్ ఆనందాన్ని గిఫ్ట్ ల రూపంలో నిర్మాత కళానిధి మారన్‌ టీం అందరితో పంచుకోవడం ఆకట్టుకుంది.