English | Telugu
వారెవా.. నాలుగు రోజుల్లో రూ. 500 కోట్లు.. 'జవాన్' కలెక్షన్ తుఫాన్ !
Updated : Sep 11, 2023
ఊరికే ఎవరూ బాలీవుడ్ బాద్షాలుఅయిపోరు. బాక్సాఫీస్ లెక్కలను సరిచేస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. ముందుకు సాగుతుంటేనే అలాంటి బిరుదులు వచ్చేస్తుంటాయి. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కింగ్ ఖాన్' షారుక్ ఖాన్ గురించే. తాజాగా ఆయన తండ్రీకొడుకులుగా సందడి చేసిన 'జవాన్' చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఎంతలా అంటే.. కేవలం నాలుగు రోజుల్లో రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టేంతలా. అంతేకాదు.. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన 'జవాన్'.. తొలి రోజు నుంచి నాలుగో రోజు వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కు ఏ మాత్రం తగ్గకుండా దూకుడు చూపిస్తూ ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. మండే టెస్ట్ లో కూడా పాసై.. ఇదే హవా కొనసాగితే రూ. 1000 కోట్లు రాబట్టడం 'జవాన్'కి పెద్ద టాస్కేమి కాదు.
కాగా, 'జవాన్'లో షారుక్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొణె (స్పెషల్ రోల్) నటించగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. సంజయ్ దత్ అతిథి పాత్రలో దర్శనమిచ్చిన ఈ సినిమాకి కోలీవుడ్ కెప్టెన్ అట్లీ దర్శకత్వం వహించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించాడు.