English | Telugu
శ్రీలీల.. నిమిషానికి రూ. పది లక్షలు.. నిజమేనా!?
Updated : Sep 13, 2023
ప్రస్తుతం తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది శ్రీలీల. చేతిలో అరడజనుకి పైగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. వరుసగా ఐదు నెలల పాటు ఐదు సినిమాలతో సందడి చేయనుంది. సెప్టెంబర్ లో స్కంద, అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్ లో ఆదికేశవ, డిసెంబర్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, జనవరిలో గుంటూరు కారం.. ఇలా శ్రీలీల నెలకో సినిమాతో ఎంటర్టైన్ చేయనుంది. మరోవైపు.. ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ కాంబో మూవీ కూడా శ్రీలీల ఖాతాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. మరోవైపు షాప్ ఓపెనింగ్స్ లోనూ దర్శనమిస్తోంది. షాప్ ప్రారంభోత్సవాల కోసం ఈ అమ్మడు రూ. కోటి వరకు ఛార్ట్ చేస్తోందట. అయితే, ఈ ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్ చేయడం కోసం శ్రీలీల జస్ట్ పది నిమిషాలే కేటాయిస్తోందట. అంటే.. నిమిషానికి రూ. పది లక్షల చొప్పున శ్రీలీల పారితోషికం అందుకుంటోందన్నమాట. ఏదేమైనా.. సినిమాలతో, షాప్ ఓపెనింగ్స్ తో శ్రీలీల టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది ఇప్పుడు.