English | Telugu

మలయాళంలోకి మంచు పాండవులు

శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ వంటి తారలంతా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ "పాండవులు పాండవులు తుమ్మెదా". ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమాను మలయాళంలోకి "పాండవపురం 2014" పేరుతో ప్రేమికులరోజున విడుదల చేయనున్నారు. ఇప్పటికే విష్ణు నటించిన "దేనికైనా రెడీ", "దూసుకేల్తా" చిత్రాలు మలయాళంలోకి డబ్బింగ్ అయ్యాయి. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో త్వరలోనే తెలియనుంది. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.