English | Telugu

మ‌రీ ఓవ‌ర్ అయ్యింది మ‌హేష్‌ష్‌ష్‌ష్‌!



ఇది వ‌ర‌కు మ‌హేష్‌బాబు మీడియాకు వీలైనంత దూరంగా ఉండేవాడు. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప‌యినా మీడియాకు క‌నిపించేవాడే కాదు. ఏదో ఓసారి ఆడియో ఫంక్ష‌న్‌లో అలా మెరుపులా మెరిసి మాయ‌మ‌య్యేవాడు. నిర్మాత‌ల పోరు ప‌డ‌లేక మూకుమ్మ‌డి ఇంట‌ర్వ్యూలు ఇచ్చి మ‌మ అనిపించేవాడు. కానీ ఇప్పుడు మ‌హేష్ దృక్ప‌థంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. `శ్రీ‌మంతుడు` విష‌యంలో మ‌హేష్ అవ‌లంభించిన‌, అవలంభిస్తొన్న ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ చూస్తే ఈ విష‌యం అవ‌గ‌తం అవుతుంది. మీడియాకు మూకుమ్మ‌డిగా ఓసారి, ప‌ర్స‌న‌ల్‌గా ప్ర‌తి పేప‌ర్‌కీ ఓసారి ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు మ‌హేష్‌. ఈనాడు అయితే ఫుల్ పేజీ ఇంట‌ర్వ్యూతో మ‌హేష్‌ని ప్రోత్స‌హించింది కూడా.

ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ప్ర‌తి పేప‌ర్‌కీ విడివిడిగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు.అంటే ఒకొక్క పేప‌ర్‌కీ మూడు ముఖాముఖిల‌న్న‌మాట‌. ఇది వ‌ర‌కు సినిమాకి ఒక్క‌సారి మాట్లాడ‌డానికే మొహ‌మాట‌ప‌డే మ‌హేష్ ఇప్పుడు ఇంతిలా ఎందుకు మారాడు? అనేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. దీని వెనుక శ్రీ‌మ‌తి న‌మ్ర‌త ఉన్న‌ట్టు మ‌హేష్ సైతం ఒప్పుకొన్నాడు. లో ప్రెఫైల్ లో ఉంటే ఏ సినిమాకీ భారీ ఓపెనింగ్స్ రావ‌న్న విష‌యం మ‌హేష్‌కి అవ‌గ‌త‌మైంది. దీనికి తోడు బాహుబ‌లి వ‌సూళ్లు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నాయి.

అందుకే మ‌హేష్ ఈసారి ప‌బ్లిసిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త తీసుకొన్నాడు. అయితే.. ఈ ప‌బ్లిసిటీ పిచ్చి మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. రోజుకో ప్రెస్‌మీట్‌, నాలుగు రోజుల‌కు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చుకొంటూ పోతే.. మ‌హేష్ మొహం మొత్తేసే స్టేజీకి వెళ్లిపోయే ఛాన్సుంది. ఇప్ప‌టికే ఈ ప‌బ్లిసిటీ హంగామా మ‌రీ ఓవ‌ర్ అయ్యింది అంటూ మీడియా మిత్రులే మాట్లాడుకొంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.