English | Telugu

ఎన్టీఆర్‌కి మ‌హేష్ ఫోన్‌??

టాలీవుడ్ అంతా టెంప‌ర్ మానియా పాకేసింది. ఈ సినిమాని అభిమానులే కాదు, సెల‌బ్రెటీలూ తెగ చూసేస్తున్నారు, కాంప్లిమెంట్లు అందించేస్తున్నారు. మొన్న దాస‌రి నారాయ‌ణ‌రావు టెంప‌ర్‌ని ప్ర‌త్యేకంగా వీక్షించారు. 'నా వార‌సుడు పూరినే' అని కితాబిచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని మ‌హేష్ బాబు కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. మ‌హేష్ కీ ఈ సినిమా పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. ''పూరి.. సూప‌ర్బ్‌గా తీశావ్‌, సినిమా అద్భుతంగా ఉంది'' అంటూ పూరికి కాంప్లిమెంట్లు అందించాడు మ‌హేష్. అంతేకాదు.. ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి ప్ర‌త్యేకంగా మాట్లాడాడ‌ట‌. ''నీ పెర్ ఫార్మ్సెన్స్ మైండ్ బ్లోయింగ్‌..'' అంటూ మెచ్చుకొన్నాడ‌ట‌. పూరి - మ‌హేష్ లు ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సినిమాలు చేశారు. హ్యాట్రిక్ మూవీ త్వ‌ర‌లో అంటూ ఆమ‌ధ్య మీడియాలో ప్ర‌చారం బాగా జ‌రిగింది. అయితే పూరి ఫామ్‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల హ్యాట్రిక్ మూవీ సంగ‌తి లైట్ గా తీసుకొన్నాడు మ‌హేష్. టెంప‌ర్ చూశాక‌.. త‌న అభిప్రాయం మార్చుకొని ఉంటాడేమో మ‌రి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.