English | Telugu

నానా హైరానా.. ఇది కదా శంకర్ రేంజ్ సాంగ్ అంటే...

Publish Date:Nov 28, 2024

స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు మాత్రమే కాదు, ఆయన సినిమాల్లోని పాటలు కూడా భారీగా ఉంటాయి. శంకర్ తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్.. ఇలా ప్రతి దానిలో తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ఒక్కోసారి ఒక సాంగ్ ని చిత్రీకరించడానికే, ఏకంగా ఒక చిన్న సినిమా బడ్జెట్ అంత ఖర్చు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ ఖర్చుకి తగ్గట్టుగానే అవుట్ పుట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. కేవలం పాటల కోసమే.. శంకర్ సినిమాలను రిపీటెడ్ గా చూసినవాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చిన శంకర్ సినిమాల్లోని పాటలను.. ఇప్పటికీ వింటున్నారు, చూస్తున్నారు. అది శంకర్ సాంగ్స్ క్రియేట్ చేసిన బ్రాండ్. ఆ బ్రాండ్ ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'కి కూడా కొనసాగుతోంది. (Game Changer) రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఆ రెండు పాటలు బాగానే ఉన్నప్పటికీ, శంకర్ రేంజ్ సాంగ్స్ కాదనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ కి చెక్ పెడుతూ "నానా హైరానా" అంటూ సాగే మూడో సాంగ్ వచ్చింది. ఈ మెలోడీ సాంగ్ కి థమన్ అందించిన సంగీతం కట్టిపడేస్తోంది. "నానా హైరానా.. అరుదైనా హైరానా.. నెమలీకల పులకింతై, నా చెంపలు నిమిరేనా" వంటి బ్యూటిఫుల్ లైన్స్ తో రామజోగయ్యశాస్త్రి అందించిన లిరిక్స్ హత్తుకునేలా ఉన్నాయి. అలాగే శ్రేయా ఘోషల్, కార్తీక్ ల మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. (Naanaa Hyraanaa Song) ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ పడితే.. డైరెక్టర్ శంకర్ దానిని విజువల్ గా ఏ రేంజ్ కి తీసుకెళ్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "నానా హైరానా" సాంగ్ విషయంలోనూ అదే జరిగింది. విజువల్ గా సాంగ్ అదిరిపోయింది. లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సాంగ్ లో ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా? అనే ఫీలింగ్ ని ఈ సాంగ్ కలిగిస్తోంది. మొత్తానికి "నానా హైరానా"తో శంకర్ తన బ్రాండ్ సాంగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించారని చెప్పవచ్చు.

Allari Naresh shines as Bachhala Malli in the teaser

Publish Date:Nov 28, 2024

Allari Naresh has proven himself as a versatile performer with his films and Bachhala Malli seems to present him in a rugged and massy look. The look suits him well and he seems to put more than 100 percent efforts to shine in this character.  Vishal Chandrasekhar songs are impressive and the movie is carrying a good buzz with his soulful tracks. Now, the teaser presents Allari Naresh in a different body language to what we have been accustomed to watching him. He carries the role pretty brilliantly to say the least.  Amritha Aiyer is playing the leading lady role and she has a good chemistry with Naresh. Director Subbu Mangadevvi seems to have used Naresh's capabilities well enough to shine in this rugged romance.  Producers Razesh Danda and Balaji Gutta are producing the movie with a high budget for an Allari Naresh film. Movie is releasing all over on 20th December. 

ఆ సంఘటనతో శోభన్‌బాబు గొప్పతనం ఏమిటో తెలుసుకున్న దర్శకుడు!

Publish Date:Nov 28, 2024

సినిమా రంగంలో నిర్మాతల క్షేమాన్ని కోరుకునే హీరోలు, క్రమశిక్షణతో నడుచుకునే హీరోలు కొందరే ఉన్నారు. వారిలో అందాల నటుడు శోభన్‌బాబు ఒకరు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ల తర్వాత అంతటి క్రమశిక్షణ ఉన్న నటుడు శోభన్‌బాబు. 35 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అజాత శత్రువు అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి శోభన్‌బాబు సినిమా వల్ల దర్శకుడు రేలంగి నరసింహారావుకి ఒక అన్యాయం జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రేలంగి... చంద్రమోహన్‌, ప్రభ జంటగా వచ్చిన ‘నేను మా ఆవిడ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ఆయనకు వరసగా అవకాశాలు వచ్చాయి. కామెడీ సినిమాల డైరెక్టర్‌గా రేలంగికి మంచి పేరు వచ్చింది. తన కెరీర్‌లో 70 సినిమాలను డైరెక్ట్‌ చేసిన రేలంగి.. అందులో రాజేంద్రప్రసాద్‌తో 32, చంద్రమోహన్‌తో 18 సినిమాలు చేశారు. కామెడీ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సమయంలో రేలంగికి శోభన్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఏం జరిగింది, శోభన్‌బాబు వల్ల రేలంగి ఏ విధంగా నష్టపోయారు అనే విషయం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘నేను అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు శోభన్‌బాబుగారితో కలిసి పనిచేసిన ఒకే ఒక్క సినిమా ‘బలిపీఠం’. అప్పుడు ఆయనలో వున్న క్రమశిక్షణ, డెడికేషన్‌ చూశాను.  నేను డైరెక్టర్‌ అయి కొన్ని సినిమాలు చేసి బిజీ అయిన తర్వాత ఒక నిర్మాత నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. వాళ్ళ ఆఫీస్‌కి వెళ్లాను. ఏ చంద్రమోహన్‌తోనో, రాజేంద్రప్రసాద్‌తోనో సినిమా ఉంటుంది అనుకున్నాను. శోభన్‌బాబుగారు హీరోగా సినిమా అన్నారు. మొదట షాక్‌ అయ్యాను.. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. సినిమాకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్‌ మొదలుపెట్టాం. నేను, సత్యానంద్‌ డిస్కషన్స్‌లో కూర్చునే వాళ్ళం. అలా ఓ వారం రోజులు సిట్టింగ్స్‌ జరిగాయి. ఎనిమిదో రోజు ఆ సినిమా ఆఫీస్‌ నుంచి కారు రాలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజులు కూడా కారు రాలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని సత్యానంద్‌కి ఫోన్‌ చేశాను. ఆయన చెప్పిన మాట విని మరోసారి షాక్‌ అయ్యాను. ఈ సినిమా నుంచి మిమ్మల్ని తప్పించి వేరే డైరెక్టర్‌ని పిలిపించారు’ అని చెప్పారు. ఆ నిర్మాతలు నేనే కావాలని పిలిపించారు. హీరో ప్రమేయం లేకుండా డైరెక్టర్‌ని ఎవరూ మార్చరు. అప్పుడు శోభన్‌బాబుగారి మీద నాకు బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత గురువుగారి సినిమాల షూటింగ్‌ జరిగేటపుడు సెట్స్‌కి వెళ్ళేవాడిని. అక్కడ శోభన్‌బాబుగారు ఉన్నా నేను విష్‌ చేసేవాడ్ని కాదు.  కొంతకాలం తర్వాత నిర్మాత శాఖమూరి రామచంద్రరావుగారు ఓ సినిమా కోసం నన్ను ఆఫీస్‌కి పిలిపించారు. శోభన్‌బాబుగారితో సినిమా చేస్తున్నాం. మీరే డైరెక్ట్‌ చెయ్యాలి అని చెప్పారు. అయితే ఈ విషయం శోభన్‌బాబుగారికి తెలుసా. నా డైరెక్షన్‌ అంటే ఆయన వద్దంటారు అన్నాను. అవన్నీ మేం చూసుకుంటాం. మీరు చేస్తారా, చెయ్యరా అన్నారు. శోభన్‌బాబుగారు లాంటి పెద్ద హీరోతో సినిమా చెయ్యను అని ఎలా అంటాను అన్నాను. ఒక సినిమా నుంచి నన్ను తప్పించి మరో సినిమా చెయ్యడానికి ఆయన ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచించి ఆయన పర్సనల్‌ మేకప్‌మేన్‌ అప్పారావుకి ఫోన్‌ చేసి ఒకసారి శోభన్‌బాబుగారిని కలవాలి అని అడిగాను. మర్నాడు పది గంటలకు రమ్మని చెప్పారు. నేను వెళ్లాను. అప్పుడు శోభన్‌బాబుగారు చెప్పిన మాటలు విని ఆయన్ని ఎంత అపార్థం చేసుకున్నాను అని నన్ను నేనే తిట్టుకున్నాను. ‘మీ విషయంలో నాకు ఒక బాధ వుంది నరసింహారావుగారు. నేను చేసే సినిమా డైరెక్టర్‌ని ఇంతవరకు ఎప్పుడూ మార్చలేదు. కానీ, మీకు కామెడీ సినిమాల డైరెక్టర్‌గా మంచి పేరు వుంది. అయితే నా మార్కెట్‌కి తగ్గ సినిమా మీరు చెయ్యలేరు అని ఆ నిర్మాత అనుకున్నారు. తనకు బిజినెస్‌పరంగా పెద్ద ఆఫర్లు రావడం లేదు అని చెప్పారు. సినిమా ఎవరితో చెయ్యాలనేది నిర్మాత ఇష్టం కాబట్టి నేను ఏమీ అనలేదు. అప్పటి నుంచి నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నాను. మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ‘ఆ సినిమా మిస్‌ అయిన తర్వాత అది మీ వల్లే జరిగిందని అపార్థం చేసుకున్నాను. క్షమించండి’ అన్నాను. ‘ఫర్వాలేదు. మీరు చక్కగా సినిమా చేసుకోండి’ అని చెప్పారు. అలా శోభన్‌బాబుగారు, జయప్రద, శారద, రాజేంద్రప్రసాద్‌, రజనిలతో ‘సంసారం’ చిత్రం చేశాను’ అంటూ వివరించారు రేలంగి నరసింహారావు.

నేను సింగిల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికాషెరావత్ 

Publish Date:Nov 28, 2024

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు మల్లికా షెరావత్(mallika sherawat)2003 లో 'వాషిష్' అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన మల్లికా, ఆ తర్వాత మర్డర్, కిస్ కిస్ కి కిస్మత్,గురు, వెల్ కమ్, థాంక్యూ, తేజ్, జీనత్, డర్టీ పాలిటిక్స్ ఇలా సుమారు ముప్పై సినిమాల దాకా చేసింది.కమల్ హాసన్ హీరోగా తమిళ,తెలుగు భాషలో విడుదలైన "దశావతారం' మూవీలో కూడా తనదైన నటనతో ప్రేక్షకులని అలరించిన మల్లికా రీసెంట్ గా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' అనే సినిమాలో ప్రధాన పాత్రని పోషించింది.గత నెల అక్టోబర్ 11 న విడుదలైన ఈ మూవీ ఈ నెలలోనే ఓటిటి లో విడుదలకి సిద్దమవుతుంది. ఈ క్రమంలో మల్లికా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు గతంలో నేను ఒక వ్యకితో ప్రేమలో ఉన్న మాట నిజమే కానీ అది బ్రేకప్ అయ్యింది. దాని గురించి ఇప్పుడు ఏమి మాట్లాడదల్చుకోలేదు.ప్రస్తుతానికి అయితే  సింగల్ గానే ఉంటున్నాను.పెళ్లి పై నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.మంచి మనసున్న వ్యక్తిని పొందటం ఈ రోజుల్లో కష్టమే.శరీరాకృతి, ఆరోగ్యం  విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, మంచి భోజనము తీసుకొని సమయానికి నిద్రపోతున్నాను.ఎలాంటి చెడు వ్యసనాలు కూడా లేవని చెప్పుకొచ్చింది అలాగే డైరెక్టర్స్ సినిమా ఒప్పుకునే ముందు మన క్యారెక్టర్ గురించి ఒక రకంగా చెప్పి,ఆ తర్వాత వేరే రకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు 'ది రాయల్స్ 'ని తిరస్కరించాననే విషయాన్ని కూడా వెల్లడి చేసింది.  

సూసైడ్ చేసుకోవాలనుకున్న డాన్స్ మాస్టర్

Publish Date:Nov 28, 2024

మణికంఠ మాష్టర్ అంటే ఢీ షో ఒక మంచి పేరు ఉంది. అలాంటి ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. వచ్చామా డాన్స్ చేశామా వెళ్ళిపోయాము అన్నట్టుగా తన పని తానూ చూసుకునే మణికంఠ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "మా కుటుంబంలో అన్నీ మా అన్నయ్య , వదిన  చూసుకునే వారు. ఐతే   మా వదిన చనిపోయారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో పాప ఉదయం, వదిన సాయంత్రం చనిపోయారు. తర్వాత మూడు నెలలకు రోడ్ యాక్సిడెంట్ లో మా అన్నయ్య చనిపోయారు.   ఐతే ఈ విషయాలు ఎక్కువగా ఎవరికీ చెప్పను. ఎందుకంటే వాళ్ళు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను... అంటే అందరికీ తెలియాలి అని.  నేనేమో డాన్స్ పేరుతో అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని. ఇక మా అమ్మ కూడా చనిపోయింది అని తెలిసాక నా మైండ్ అంతా ఏదోలా ఐపోయింది. ఆ టైంలో నేను ఎవరి దగ్గర పని చేసానో వాళ్ళు కూడా నాకు పని ఇవ్వలేదు. దాంతో ఎం చేయాలో తెలీక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా. ఇక ఆ టైములో నన్ను చేరదీసిన మా రేవతి మేడం, ఆనంద్ సర్ నన్ను తిట్టి జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పి నా మైండ్ మార్చారు. కష్టం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు అని చెప్తున్నా. నిజంగా ఆ స్ట్రెస్ లో డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుని ఉంటె గనక ఈరోజు మీ అందరి ముందు ఉండేవాడిని కాదు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కునే ధైర్యం అందరిలో రావాలని అనుకుంటున్నా. నాలాగా ఎవరూ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని కోరుతున్నా. అందరూ నన్ను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ లా ఉన్నారు అని అనేవారు. ఆ మాట విన్నప్పుడు  నాలో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. అలాగే అందరూ నన్ను జూనియర్ లారెన్స్ అంటారు. ఐతే ఆ పేరును ఢీ షోలో ప్రియమణి గారు పెట్టారు. లారెన్స్ గారు ఎవరికీ తెలీకుండా ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. నాకు కూడా అది ఇష్టం. అందుకే నాకు ఎంత తోచితే అంత ఎవరికీ తెలియకుండా సాయం చేస్తూ ఉంటాను" అని డాన్స్ కొరియోగ్రాఫర్ మణికంఠ  చెప్పారు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

మరో హిందీ మూవీ సైన్ చేసిన ఎన్టీఆర్!

Publish Date:Nov 27, 2024

'వార్-2' మూవీతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 ఆగస్టులో విడుదల కానుంది. అయితే 'వార్-2' షూటింగ్ దశలో ఉండగానే, మరో హిందీ సినిమాకి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ 'వార్-2'లో ఎన్టీఆర్ ని భాగం చేశాడని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ ని చూసి మరింత ఇంప్రెస్ అయిన ఆదిత్య చోప్రా.. ఎన్టీఆర్ సోలో హీరోగా మరో భారీ సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మూవీకి కూడా అయాన్ ముఖర్జీనే దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి కథా చర్చలు కూడా జరిగినట్లు వినికిడి. అయాన్ చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ బాగా నచ్చిందట. 'వార్-2' పూర్తయ్యాక, ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

జీబ్రా

Publish Date:Nov 22, 2024

కంగువా

Publish Date:Nov 14, 2024

మట్కా

Publish Date:Nov 14, 2024

Devaki Nandana Vasudeva

Publish Date:Nov 23, 2024

Mechanic Rocky

Publish Date:Nov 22, 2024

Zebra

Publish Date:Nov 22, 2024

Kanguva

Publish Date:Nov 14, 2024

Matka

Publish Date:Nov 14, 2024