English | Telugu
బ్యానర్:భువనేశ్వరి పిక్చర్ ప్రెజెంట్స్,ఓల్డ్ టౌన్ పిక్చర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 22, 2024
తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్,ప్రియా భవానీ శంకర్, సత్య, అమృత అయ్యంగార్,సునీల్, గరుడ రామ్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ:సత్య పొన్మార్
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు:ఎస్ ఎన్ రెడ్డి,పద్మజ బాలసుందరమ్,దినేష్ సుందరం
బ్యానర్స్: భువనేశ్వరి పిక్చర్స్ ప్రెజంట్స్,ఓల్డ్ టౌన్ పిక్చర్స్
విడుదల తేదీ: నవంబర్ 22 ,2024
సోలో హీరోగా వరుస పరాజయాలని చవిచూస్తున్న సత్యదేవ్ ఈ రోజు మరోసారి సోలో హీరోగా జీబ్రా అనే విభిన్నమైన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సూర్య(సత్యదేవ్) కస్టమర్స్ చేత భారీ మొత్తంలో డిపాజిట్ చేయించే రెస్పాన్సిబిలిటీ ఉన్న ఉద్యోగిగా కూడా వర్క్ చేస్తుంటాడు.స్వాతి( ప్రియా భవానీ శంకర్) అనే మరో బ్యాంక్ ఎంప్లాయ్,సూర్య ప్రేమించుకుంటారు త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.ఈ క్రమంలో స్వాతి నిర్లక్ష్యం వల్ల ఒక కస్టమర్ అకౌంట్ లోకి వెళ్లాల్సిన ఐదులక్షల రూపాయలు వేరే కస్టమర్ అకౌంట్ లోకి వెళ్తాయి.దీంతో సూర్య ఒక ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు వచ్చేలా చేస్తాడు.ఇంకో పక్క ఆది( డాలీ ధనంజయ) అనే వ్యక్తి కొన్ని వందల కోట్లకి అధిపతి. పైగాఒక కరుడుగట్టిన నేరస్థుడు కూడా అయిన ఆది స్టేట్ లోనే ఒక బిగ్ పర్సనాలిటీకి ఒక ప్లేన్ ఇచ్చే ఒప్పందం చేసుకుంటాడు.దీంతో సూర్య ని ఐదు కోట్లు ఇవ్వాలని టార్చర్ చేస్తుంటాడు.ఇవ్వకపోతే మీ అమ్మ ని చంపేస్తానని బెదిరిస్తాడు.సూర్య ని ఐదు కోట్ల కోసం ఆది ఎందుకు టార్చర్ చేస్తున్నాడు? సూర్య చేసిన ఫ్రాడ్ ఏంటి? దాని వల్ల ఏమైనా సమస్యలు వచ్చాయా? ఆది విమానం వెనక ఉన్న కథ ఏంటి? అసలు సూర్య కి ఆది కి ఏంటి సంబంధం? అనేదే ఈ కథ
ఎనాలసిస్ :
ఇలాంటి సినిమాలకి ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని చెప్పలేం. సినిమా చాలా వరకు కూడా రివర్స్ స్క్రీన్ ప్లే తో కొనసాగుతుంది. కథ చాలా కొత్తదే ఆయినా కూడా కథనంలో మాత్రం కొత్త దనంలేదు.ముఖ్యంగా డాలి ధనుంజయ్, సునీల్ పాత్రల మధ్య సీన్స్ అన్ని కూడా చాలా లాగ్ గా ఉన్నాయి. ఫస్ట్ నుంచి చివరి దాకా వచ్చిన ఆ ఇద్దరి సీన్స్ ఒకే పాయింట్ చుట్టూ తిరిగాయి.ఇక సత్య దేవ్ పోర్షన్ వరకు చాలా బాగుంది. అదే ప్రేక్షకుడిని చివరి దాకా సీట్లలో కూర్చో పెట్టింది.ఆది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొత్తగా బాగానే ఉన్నా కూడా ఈ కథ మెయిన్ పాయింట్ కి అవి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. సూర్య క్యారక్టర్ మైండ్ తోనే ఆలోచించకుండా శారీరక శ్రమ కూడా ఉండేలా చెయ్యాల్సింది. అసలు ఈ కథ మొత్తం ఏ పాయింట్ కోసం రన్ అవుతుందో ఆ విషయాన్నీ క్లైమాక్స్ లో చూపించారు.అలా కాకుండా సినిమా ప్రారంభం నుంచే ఆ పాయింట్ కి కూడా చూపిస్తూ ఉంటే మూవీకి సరికొత్త లుక్ వచ్చిఉండేది. చాలా సీన్స్ లో విపరీతమైన లాగ్ ఉంది.కాకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలని,వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చనేది మాత్రం చాలా చక్కగా చూపించారు. కామెడి గా అవకాశం ఉన్నా కూడా సరిగా ఉపయోగించుకోలేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణల పనితీరు:
సూర్య పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. చాలా సన్నివేశాల్లో పరిణితి గల నటనని ప్రదర్శించాడు.క్యారక్టర్ లో వేరియేషన్స్ లేకపోయినా కూడా తన పరిధిలో బాగానే చేసాడు. ఇక ప్రియా భవానీ శంకర్(priya bhavani shankar)క్యారక్టర్ కి అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కూడా ఉన్నంతలో బాగానే చేసింది. డాలి ధనుంజయ్dolly dhananjay)ఐతే ఒక రేంజ్ పెర్ఫారెన్సు ని ప్రదర్శించాడు.యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లో బాగా చేసాడు. బాబా క్యారక్టర్ లో చేసిన సత్యరాజ్ కూడా తన పాత్ర పరిధి మేరకు సూపర్ గా చేసాడు.ఇక మిగతా పాత్రల్లో చేసిన సునీల్, సత్య ల నటన కూడా బాగుంది.ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం బాగానే ఉంది. కాకపోతే కథనంలోనే రాంగ్ స్టెప్ వేసాడు. ఇక కెమెరా పనితనం సూపర్ గా ఉండి ప్రేక్షకుల చూపుల్నిపక్కకు తిప్పుకొని విధంగా చేసింది.
రవి బసూర్ ఆర్ఆర్ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటి నటులతో పాటు ఆల్ టెక్నీషియన్స్ పనితనం జీబ్రా లో స్పష్టంగా కనపడింది. కాకపోతే కథనంలోని లోపల వల్ల ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువని చెప్పవచ్చు.