English | Telugu

బాలు గారి కొడుకు చరణ్ సంచలన నిర్ణయం..అభిమానులకి నిరాశే  

తన గాత్రంతో కేవలం మనుషులనే కాకుండా సమస్త జీవరాశుల్ని సైతం తన్మయత్వంతో ఉగిపోయేలా చేసిన గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం(sp balasubrahmanyam)పాట కోసం అయన పుట్టాడా, లేక పాటే ఆయన కోసం పుట్టిందా అనే విధంగా బాలు గారి సినీ ప్రయాణం సాగింది.తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ, హిందీ భాషల్లోనే  కాకుండా మరికొన్ని ఇతర భాషల్లో కూడా కలుపుకొని సుమారు నలభై వేల పాటలు పాడిన రికార్డు బాలు గారి సొంతం.సుమారు యాబై సినిమాలకి సంగీతాన్ని కూడా అందించాడు.

 రీసెంట్ గా బాలు గారి తనయుడు ప్రముఖ సంగీత దర్శకుడు చరణ్(sp charan)మాట్లాడుతు నాన్న గారి వాయిస్ ని  ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రేక్షకులకి అందిస్తామని కొంత మంది నా దగ్గరకొచ్చి అడిగారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టిగానే అలా చేయవద్దని చెప్పాను. ఎందుకంటే అలా చేస్తే నాన్న గారి స్వరంలో సహజత్వం ఉండదు.పైగా అలాంటి గొంతు వినడం నాకు,నా కుటుంబానికి ఇష్టం లేదు.అందుకే ఒక బాధ్యత గల సంగీత దర్శకుడు అయినప్పటికీ దానిని వ్యతిరేకించాను,పాడిన పాటల రూపంలో నాన్న గారు  ఎప్పుడు  బతికే ఉంటారని చెప్పుకొచ్చాడు.