English | Telugu
సర్జరీకి సిద్ధమవుతున్న చిరంజీవి!
Updated : Aug 14, 2023
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రెస్ట్ మోడ్‌లోకి వెళుతున్నారు. ఆయన మోకాలికి ఆపరేషన్ జరగనుంది. అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారనే వార్తలు వచ్చాయి కదా! అనే సందేహం రాక మానదు. అమెరికాలో శస్త్ర చికిత్సను చేయించుకోవటానికి గల రిపోర్ట్స్‌ను చెక్ చేయించుకున్నారట. అయితే ఆపరేషన్ మాత్రం అక్కడ చేసుకోలేదు. ఢిల్లీ లేదా బెంగుళూరులో ఆయన మోకాలికి ఆపరేషన్ జరగనుంది. ఈ చికిత్స తర్వాత మెగాస్టార్ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారు. తర్వాతే తన కొత్త సినిమాకు సంబంధించిన వర్క్‌పై ఫోకస్ చేయబోతున్నారు.
చిరంజీవి తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా స్టార్ట్ అవుతుందన్నారు. కానీ.. ఇప్పుడు చిరంజీవి మోకాలి ఆపరేషన్ కోసం ఢిల్లీ లేదా బెంగుళూరు వెళతారనే న్యూస్ వినిపిస్తోంది. ఎలాగూ వారం రోజులు మాత్రమే ఉండటంతో చిరు సినిమాను లాంఛనంగా ప్రారంభించేసి తర్వాత ఆపరేషన్‌కు వెళతారా? లేక బర్త్ డే ఈవెంట్స్‌ను పక్కన పెట్టి వెళతారా? అనేది చూడాలి మరి. ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌తో కలిసి చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మించనుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించనుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందనే న్యూస్ వినిపిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు చిరంజీవి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించింది. అయితే రీసెంట్‌గా వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు.