English | Telugu
పాన్ ఇండియా మూవీలో సంయుక్తా మీనన్
Updated : Aug 14, 2023
ఈ మధ్య టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించుకుంటోన్న హీరోయిన్స్‌లో సంయుక్తా మీనన్ ఒకరు. ఆమె కాస్త ఆలస్యంగానే తెలుగులో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అయితేనేం వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన భీమ్లా నాయక్, సర్, విరూపాక్ష సినిమాలన్నీ హిట్ అయ్యాయి. విరూపాక్ష సినిమా అయితే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈమె సినిమాలను ఎంపిక చేసుకోవటంలో తొందరపడటం లేదు. సెలక్టివ్‌గా సినిమాలకు ఓకే చెబుతుందని సినీ వర్గాల సమాచారం. తాజాగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంతకీ ఈ సొగసరి ఓకే చెప్పిన సదరు పాన్ ఇండియా మూవీలో హీరో ఎవరో కాదు.. నిఖిల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ స్పై సినిమాతో తన లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటే అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ తన తదుపరి చిత్రాలపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కోవలో నిఖిల్ నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ స్వయం భు. ఠాగూర్ మధు, భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఇప్ప్ఉడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఆగస్ట్ 18న లాంఛనంగా సినిమాను స్టార్ట్ చేసి అదే రోజు నుంచి షూటింగ్‌ను షురూ చేస్తారు. స్వయం భు తర్వాత నిఖిల్ నెక్ట్స్ మూవీ కార్తికేయ 3. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ఇప్పటికే నాగచైతన్యతో సినిమా చేస్తోన్న చందు మొండేటి ఆ సినిమాను కంప్లీట్ చేస్తూనే కార్తికేయ 3పై వర్క్ చేయబోతున్నారు.