English | Telugu
తొమ్మిదేళ్లు... లేఖ రాసిన రామ్‌చరణ్ నాయిక
Updated : Jun 14, 2023
ఇండస్ట్రీకి పరిచయమై తొమ్మిదేళ్లయిన సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెబుతూ లేఖ రాశారు నటి కియారా అద్వానీ. స్వదస్తూరితో ఆమె రాసిన లేఖ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. శ్రద్ధా కపూర్,తమన్నా కూడా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం సత్య ప్రేమ్‌కీ కథ ప్రమోషన్లలో ఉన్నారు నటి కియారా అద్వానీ. భూల్ భులయ్యా2 తర్వాత కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె నటిస్తున్న సినిమా ఇది. సౌత్‌లో రామ్‌చరణ్‌తో గేమ్ చేంజర్‌లో యాక్ట్ చేస్తున్నారు కియారా. 2014లో ఫుగ్లీ అనే సినిమాతో నటిగా జర్నీ స్టార్ట్ చేశారు కియారా. నీరజ్ పాండే ఎం.ఎస్‌దోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ, కరణ్ జోహార్ లస్ట్ స్టోరీస్ ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ రామ్ చరణ్‌తో వినయ విధేయ రామా, మహేష్‌తో భరత్ అనే నేనులో నటించారు కియారా. కెరీర్‌లో తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తనకు తోడుగా ఉన్న వారికి థాంక్స్ చెప్పారు ఈ బ్యూటీ. తన పనితో ఆడియన్స్‌కి వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
నోట్‌బుక్‌లో స్వదస్తూరితో థాంక్స్ లెటర్ రాశారు కియారా. ``మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. మీలో ఏ ఒక్కరి సపోర్ట్ లేకపోయినా నా జర్నీ ఇలా ఉండేది కాదు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నాకు స్థానం ఇచ్చారు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నా కళ్లల్లో కలలున్నాయి. కష్టపడి పనిచేయాలనే కోరిక ఉంది. నా పనితో మిమ్మల్ని అలరిస్తాను`` అని రాశారు. సో క్యూట్ అంటూ ఈ పోస్టుకు తమన్నా స్పందించారు. వావ్... చంపెయ్ అంటూ శ్రద్ధా కపూర్ పోస్ట్ పెట్టారు. `మీరు నోట్‌బుక్‌లో రాస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. మనసులోని భావాలను ఇలా పుస్తకంలో రాయడం బావుంది` అని అని ఓ అభిమాని పోస్ట్ చేశారు.