English | Telugu

నాకు భయంగా ఉందంటున్న కీర్తి సురేష్ 

కొంత మంది హీరోయిన్ల బయోడేటా ని చూసినప్పుడు మాత్రమే ఆ హీరోయిన్లు పరబాషా నటీమణులు అనే విషయం అర్ధం అవుతుంది. అప్పటి వరకు వాళ్ళ అందమైన రూపంతో అందమైన నటనతో మన అమ్మాయే అనే భావనని ఆడియన్స్ కి కలిగిస్తారు. అలా అచ్చ తెలుగు అమ్మాయిగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న నటీమణి కీర్తి సురేష్. తాజాగా నాకు ఇప్పుడు చాలా భయంగా ఉందని కీర్తి చేసిన ఒక ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.

ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కి సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి భారతదేశ వ్యాప్తంగా ఎంతగానో సంచలనం సృష్టించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ ఫేక్ వీడియో మీద స్పందించి రష్మిక కి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ విషయం మీద కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రష్మిక ఫేక్ వీడియోతో నాలో భయం స్టార్ట్ అయ్యింది. ఇలాంటి చెత్త వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తి తన టెక్నాలజీ ని ఒక మంచి పనికి ఉపయోగిస్తే దాని వలన ఎంతో మందికి ఉపయోగముంటుంది. అసలు ఇంకో పక్క టెక్నాలజీ అభివృద్ధి అనేది మనకి శాపమో వరమో కూడా తెలియడం లేదని కూడా కీర్తి చెప్పుకొచ్చింది. ప్రేమని,మంచిని పంచడం కోసమే టెక్నాలజీ ని ఉపయోగిద్దాం అనే సూచనని కూడా కీర్తి సొసైటీ కి చేసింది.

కాగా మొన్న అగస్ట్ లో చిరంజీవి హీరో గా వచ్చిన బోళా శంకర్ మూవీలో చిరు సిస్టర్ గా నటించి తెలుగు ప్రేక్షకులని అలరించిన కీర్తి ప్రస్తుతం తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. సైరెన్, రఘుతాత,రివాల్వర్ రీటా ,కన్నివెడి లాంటి చిత్రాల్లో కీర్తి నటిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.