English | Telugu

రామ్ కందిరీగ జూలై 29 న రిలీజ్

రామ్ "కందిరీగ" జూలై 29 న రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "కందిరీగ". రామ్ "కందిరీగ" స్విట్జర్ల్యాండ్‍ లో ఒక యుగళ గీతాన్ని హీరో రామ్, హీరోయిన్ హన్సిక మోత్వానీలపై ఇటీవల చిత్రీకరించారు. ఈ రామ్ "కందిరీగ" సినిమా జూలై 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

ప్రస్తుతం ఈ రామ్ "కందిరీగ" సినిమా షూటింగంతా పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూంది. రామ్ "కందిరీగ" ఆడియోని జూలై 5 వ తేదీన విడుదల చేయనున్నారు. రామ్ "కందిరీగ" సినిమాలో కలర్స్ స్వాతి ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. శ్రియా శరణ్ ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తూందని సమాచారం. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఆండ్ర్యూ వ్యవహరిస్తూండగా, కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ వ్యవహరిస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.