English | Telugu

సింగనమలకు 7 రోజులు పోలీస్ కస్టడీ

సింగనమలకు 7 రోజులు పోలీస్ కస్టడీ విధించారు. వివరాల్లోకి వెళితే "ఖలేజా, కొమరంపులి" వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత, సినీ ఫైనాన్సియర్ అయిన సింగనమల రమేష్ ను ఇటీవల సిఐడి పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. అరెస్టైన సింగనమల రమేష్ ని నాంపల్లి ఆరవ ఎడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, సింగనమల రమేష్ ని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపించారు.

ప్రముఖ రాయలసీమ ఫ్యాక్షనిస్టు మద్దులచెరువు సూరి, అతన్ని హత్య చేసిన అతని ముఖ్య అనుచరుడు భాను కిరణ్ ల పేర్లుచెప్పి సింగనమల రమేష్ అనేక అకృత్యాలకు పాల్పడినట్లు, కొందరిని బెదిరించినట్లూ ఆయన మీద అనేక ఆరోపణలున్నాయి. అంతే కాకుండా భాను కిరణ్ అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తులన్నింటికీ, బినామీ పేర్లతో సింగనమల రమేష్, నిర్మాత సి.కళ్యాణ్ ఇద్దరి అధీనంలో ఉన్నాయని సిఐడి పోలీసులు కోర్టుకి సమర్పించిన ఛార్జి షీట్ లో పేర్కొనటం విశేషం.