English | Telugu
రజినీ 171... కమల్ కామెంట్స్
Updated : Sep 17, 2023
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఒకప్పుడు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ తర్వాత అగ్ర హీరోలుగా ఎదిగి నువ్వా నేనా? అనే రేంజ్లో పోటాపోటీగా సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా కమల్ హాసన్.. సైమా అవార్డ్స్ 2023 వేడుకల్లో విక్రమ్ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంలో రజినీకాంత్‌తో ఉన్న అనుబంధంపై, లోకేష్ కనకరాజ్‌తో తలైవర్ చేయబోతున్న 171వ మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘‘ఇటీవల నా స్నేహితుడు రజినీకాంత్ తన 171వ సినిమా గురించి ప్రకటన వచ్చింది. ఆ సినిమాను నా వీరాభిమాని లోకేష్ కనకరాజ్ దర్శకత్వం చేస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు చాలా మంది మీ వీరాభిమాని రజినీకాంత్‌తో సినిమా చేయటమేంటని సందేహాం వ్యక్తం చేశారు. అయితే ఓ స్నేహితుడిగా వారి కలయికలో సినిమా రానుండటంపై ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కమల్ 50 ఈవెంట్‌లో రజినీకాంత్‌తో నా అనుబంధం గురించి మాట్లాడాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. మాలాంటి ఫ్రెండ్స్ అప్పటి తరంలో ఎవరూ లేరు. అలాగని పోటీ లేదా? అంటే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. అయితే అది ఎప్పుడూ ఆరోగ్యకంగా ఉండేది. అందువల్లే మేం ఈ రేంజ్‌కు చేరుకున్నాం’’ అన్నారు.
ఇదే సమయంలో కమల్ హాసన్ తన 234వ సినిమా గురించి ప్రస్తావించారు. నాయకుడు సినిమాకు ఎలాగైతే వర్క్ చేశామో..మా కాంబోలో రాబోతున్న సినిమాకు పని చేస్తున్నాం. ఈ మూవీ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జతగా త్రిష నటిస్తుంది. మరోవైపు కమల్ హాసన్ తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇండియన్ 2లోనూ నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.