English | Telugu

'కల్కి' వివాదం.. కేసు వేస్తున్న నిర్మాతలు

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కల్కి2898 AD’ ఒక‌టి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్నిఅన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇలా ఉంటుంది..అలా ఉంటుందంటూ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి. రీసెంట్‌గా దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా నెట్టింట తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే ప్ర‌భాస్ లుక్‌కి సంబంధించి. ‘కల్కి2898 AD’లో ప్ర‌భాస్ కొత్త లుక్ మేక‌ర్స్ అనుమ‌తి లేకుండా బ‌య‌ట‌కు లీకైంది.

‘కల్కి2898 AD’ లీకేజీ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉన్న మేక‌ర్స్ అస‌లు ఎవ‌రి నుంచి ఈ లుక్ లీకైంద‌నే దానిపై ఆరా తీసి అస‌లు విష‌యాన్ని తెలుసుకున్నారు. మూవీకి వి.ఎఫ్‌.ఎక్స్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తోన్న సంస్థ నుంచే ఈ ఫొటో బ‌య‌ట‌కు లీకైంది. దీంతో నిర్మాత‌లు స‌ద‌రు వి.ఎఫ్‌.ఎక్స్ సంస్థ‌పై కేసు వేస్తున్నారు. భారీ మొత్తంలో ఫైన్ డ‌బ్బుల‌ను వ‌సూలు చేయాల‌ని వారు భావిస్తున్నారు. మ‌రి దీనిపై స‌ద‌రు సంస్థ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ఇంకా తెలియ‌టం లేదు.

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న సినిమాల్లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ‘కల్కి2898 AD’ రూపొందుతోంది. ప్ర‌భాస్‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకొనె స‌హా ప‌లువురు పాన్ ఇండియా స్టార్స్ ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. అధ‌ర్మం పెరిగిన‌ప్పుడు తాను క‌ల్కిగా ఉద్భ‌విస్తాన‌ని మ‌హావిష్ణువు చెప్పిన‌ట్లు మ‌న గాథ‌ల్లో ఉంది. దాన్ని బేస్ చేసుకుని నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .