English | Telugu
బరిలో 'సలార్' ఉన్నా తగ్గేదేలే అంటున్న కళ్యాణ్ రామ్!
Updated : Dec 7, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ 'డెవిల్'. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. నవంబర్ 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
డెవిల్ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుందని ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా మేకర్స్ కూడా అదే తేదీని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
కాగా డిసెంబర్ 22న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా విడుదల కానుంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆరు రోజుల వ్యవధిలోనే ఈ చిత్రానికి పోటీగా కళ్యాణ్ రామ్ డెవిల్ తో వస్తుండటం ఆసక్తికరంగా మారింది.
‘డెవిల్’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్, ప్రొడఓన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్, ఎడిటర్‌గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.