English | Telugu

తిరుమలకి రహస్యంగా వచ్చిన అల్లు అర్జున్ కూతురు అర్హ.

ఇప్పుడు నడుస్తున్న ఇంటర్నెట్ యుగంలో హీరోలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా నిమిషంలో అందరికి తెలిసిపోతున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూతురు అర్హ కి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

స్నేహరెడ్డి తన కూతురు అర్హ తో కలిసి ఈ రోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంది. ఉదయం పూట ఉండే విఐపి దర్శనం సమయంలో స్నేహ అర్హతో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం పూజారులు స్నేహ కి తీర్ధ ప్రసాదాలని అందచేశారు.ఆ తర్వాత అర్హ తో కలిసి స్నేహ బయటికి వచ్చింది. ఈ సమయంలో కొంత మంది అర్హ ని ఫోటో తియ్యబోతుంటే అర్హ చాలా తెలివిగా స్నేహ చున్నీ తో తన ముఖం ఎవరు చుడకుండా ముఖానికి కప్పుకుంది. ఫొటోలకి పోజులు ఇవ్వమని అక్కడున్న వారు అడిగినా కూడా అర్హ మాత్రం తన ముఖాన్ని చూపించలేదు. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంత మంది అయితే తనని ఎవరు చూడకూడదని అర్హ అనుకుంటుందంటే రహస్యంగా వచ్చిందేమో అని సరదాగా మాట్లాడుకుంటున్నారు

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లు కూడా అర్హ కి సంబంధించిన ఎన్నో క్యూట్ వీడియోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే అర్హ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అర్హ చిన్న సైజు సెలబ్రిటీ కూడా. అల్లు అర్జున్ కొడుకు ఆయాన్ కంటే అర్హనే బన్నీ అభిమానుల్లోను బయట పెద్ద ఫేమస్.