English | Telugu
ఇండియన్2 సెట్స్ లో కాజల్
Updated : Mar 1, 2023
ఇండియన్2 సినిమా సెట్స్ లో ఉన్నారు కాజల్ అగర్వాల్. ఈ సినిమా షూటింగులో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. వ్యానిటీ వ్యాన్‌లో ఉన్న ఫొటో షేర్ చేసుకున్నారు. తన లుక్‌ని జనాలు గుర్తుపట్టకుండా ఫొటోతో హైడ్ చేసుకున్నారు. ఇండియన్ 2 కమింగ్ సూన్ అంటూ విషయాన్ని పంచుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ఈ పోస్టు పెట్టీపెట్టగానే వెల్కమ్ బ్యాక్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియన్2 షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతోంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుంది. దీంతో మేజర్ పోర్షన్ పూర్తవుతుంది. తిరుపతిలో తెరకెక్కించే ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ``ఇండియన్2 చాలా స్పెషల్. మళ్లీ నేను నా పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. సినిమా ఇండస్ట్రీని నేను పుట్టిల్లుగానే భావిస్తాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఇక్కడే నేర్చుకున్నాను. ఎన్నో విషయాలను ఆ తర్వాత నేను హాబీలుగా మార్చుకున్నాను. నిత్యం నన్ను నేను అప్‌డేట్ చేసుకుంటూనే ఉన్నాను. కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను. ఇలాంటి ఇండస్ట్రీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు వస్తున్న అవకాశాలకు చాలా ధన్యవాదాలు. ఇకపై కొత్త కాజల్‌ని చూస్తారు `` అని రాసుకొచ్చారు.
ఇండియన్2 సినిమాలో కాజల్‌తో పాటు రకుల్ కూడా నటిస్తున్నారు. కమల్‌హాసన్ ఈ సినిమాలో దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారన్నది ఇన్‌సైడ్ టాక్. ఆల్రెడీ విక్రమ్‌తో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న కమల్‌హాసన్ ఆ జోష్‌తోనే ఈమూవీ చేస్తున్నారట. బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు మేకర్స్. ప్రస్తుతం రామ్‌చరణ్ ఆస్కార్ పనుల కోసం షూటింగ్ బ్రేక్ తీసుకోవడంతో, ఇండియన్2 మీద కాన్‌సెన్‌ట్రేట్ చేశారు శంకర్.