English | Telugu
వారెవా... సూపర్ కదా అంటున్న యామీ గౌతమ్
Updated : Mar 1, 2023
యామీ గౌతమ్ ఇప్పుడు తనదారి రహదారి అంటున్నారు. ఎ థర్స్ డే, దాస్వి, లాస్ట్... ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రామి సింగ్ పెర్ఫార్మెన్సులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆడియన్స్ నుంచి మేకర్స్ నుంచి మాత్రమే కాదు, క్రిటిక్స్ నుంచి కూడా బెస్ట్ రివ్యూలు అందుకుంటున్నారు యామీ గౌతమ్ ధర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి నటీమణులుగా చలామణి అవుతున్నవారిలో ముందు వరుసలో ఉన్నారు యామీ గౌతమ్.కేవలం నటన గురించే కాదు, మనసులో ఏం ఉన్నా ఓపెన్‌గా చెప్పేసే విషయంలోనూ యామీ పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా యామీ గౌతమ్ విమెన్ సెంట్రిక్ సినిమాల గురించి మాట్లాడారు.
"గతంతో పోలిస్తే మహిళా ప్రాధాన్యత గల సినిమాలను తెరకెక్కించడంలో బాలీవుడ్‌లో చాలా మార్పులు గమనిస్తున్నాను. విమెన్ సెంట్రిక్ అనే పదాన్ని వాడటం నాకు నచ్చలేదు. త్వరలోనే ఈ పదం రూపుమాసిపోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రతి వారం హీరోల సినిమాలే రూల్ చేస్తుంటాయి. ఎకనామిక్స్ మాట్లాడాలన్నా వారి సినిమాల గురించే మాట్లాడుతుంటారు. కానీ ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు కూడా మగవారితో సమానంగా స్త్రీలు మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు. వారిని షీరోలుగా ఎలివేట్ చేసే సబ్జెక్టులు చాలా రావాలి. మార్పు రాత్రికి రాత్రి రాదు. ఏళ్లు పడుతుంది. మదర్ ఇండియా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా విడుదలైనప్పుడు, కనీసం ఇలాంటి సబ్జెక్టుల గురించి మాట్లాడుకునేవారు కూడా ఉండేవారు కాదేమో. అలాగే స్మితా పాటిల్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇప్పటికీ ఆమె ఇంటర్వ్యూలు చూస్తుంటాను. మహిళా పాత్రలకు గౌరవం తెచ్చినవారు ఆమె. నేను అలాంటివారిని చూస్తూ పెరిగాను. కెరీర్ ప్రారంభంతో పోలిస్తే, ఇప్పుడు చాలా ఎదిగాను. నేను ఎంపిక చేసుకునే పాత్రల విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. అత్యుత్తమ పాత్రలు ఇంకా నా దారిలో తారసపడతాయని భావిస్తున్నాను. రచయిత రాసే పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటే, నటీనటులు తమ పెర్ఫార్మెన్స్ తో డబుల్ ఎనర్జిటిక్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తారు" అని చెప్పారు.