English | Telugu
చిరంజీవి ఓటు ఎవరికి?
Updated : Mar 1, 2023
2010లో గోపీచంద్ మలినేని దర్శకునిగా పరిచయమయ్యారు. రవితేజ నటించిన డాన్ శీను చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి హిట్ అయింది. కానీ తర్వాత వచ్చిన వెంకటేష్ తో చేసిన బాడీగార్డ్ చిత్రం పెద్దగా ఆడలేదు. మరల మరోసారి రవితేజ తో బలుపు చిత్రం తీసి హిట్ కొట్టారు. కానీ తర్వాత చేసిన రామ్ పండగ చేసుకో, సాయిధరమ్ తేజ్ విన్నర్ వంటి చిత్రాలు ప్రేక్షలను అంతగా అలరించలేదు. మరలా రవితేజ తో క్రాక్ చిత్రం ద్వారా ఆయన లైమ్ లైట్లోకి వచ్చారు. తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ చిత్రం వీర సింహారెడ్డి తో సూపర్ హిట్ అందుకున్నారు గోపీచంద్ మలినేని. వీర సింహారెడ్డి లో బాలయ్యను ఫ్యాన్స్ కు నచ్చేలా ప్రజెంట్ చేశారు. ఇక ఇప్పుడు ఆయన చిరంజీవితో చిత్రం చేయాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన రీసెంట్‌గా చిరంజీవిని కలిశారు. ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథను వినిపించారు. గోపీచంద్ కథ పట్ల చిరంజీవి సానుకూలత వ్యక్తం చేసాడట. కొద్ది రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారట. ఆ ప్రాజెక్టు దాదాపు లాక్ అయినట్టేనని గోపీచంద్ మలినేని ఫుల్ ఖుషి తో ఉన్నారు.
చలో భీష్మ చిత్రాలతో ఇంప్రెస్ అయిన చిరంజీవి వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. వెంకీ కుడుముల చిరంజీవిని కలిసి కథ వినిపించాడట. చిరు ఓకే చెప్పడంతో భోళాశంకర్ తరువాత రాబోయే చిత్రం చిరు వెంకీ కుడుముల కాంబినేషన్లోనే అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి భోళాశంకర్ తర్వాత చేయబోయే చిత్రం ఏది? అనే విషయంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి భోళాశంకర్ తదుపరి ప్రాజెక్ట్ వెంకీ కుడుముల లేదా గోపీచంద్ మలినేనిలలో ఎవరిదో ఒకరిది అయి ఉంటుందని తెలుస్తోంది. అయినా చిరు మొదట వెంకీ కె ఓటు వేస్తున్నట్టు సమాచారం.